Weekly Horoscope 23 To 29 December: 2024 ఆఖరివారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారఫలాలు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. డిసెంబర్ ఆఖరివారంలో మేషం నుంచి కర్కాటకం వరకూ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Weekly Horoscope 23 To 29 December : డిసెంబర్ 23 నుంచి 29 వరకూ వారఫలాలు
మేష రాశి వారఫలం (Aries Weekly Horoscope)
మీరు మీ బంధువులకు ప్రత్యేక సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో పెద్ద పెద్ద మార్పులు చేర్పులు చేస్తారు. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఆచరణాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఎవరినీ అతిగా విశ్వశించవద్దు. అప్పులు ఇచ్చే ధోరణికి స్వస్తి చెప్పండి. చదువు, వృత్తికి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. గొంతుకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. .. Aries Year Astrology Prediction 2025
వృషభ రాశి వారఫలం (Taurus Weekly Horoscope)
ఈ వారం మీ ప్రియమైనవారితో స్నేహం ప్రేమగా మారుతుంది. వారం మొత్తం సరదాగా గడిపేస్తారు. ఆన్ లైన్ వ్యాపారం చేసేవారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కమీషన్ సంబంధిత విషయాలకు వారం చాలా అనుకూలమైనది. హోటల్ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగంలో మార్పులొస్తాయి. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మంగళవారం రుణ లావాదేవీలకు దూరంగా ఉండాలి. వారాంతంలో షుగర్ పేషెంట్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. Taurus Year Astrology Prediction 2025
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
మిథున రాశి వారఫలం (Gemini Weekly Horoscope)
ఈ వారం మీరు చేపట్టిన పనుల విషయంలో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సామాజిక సేవలో పాల్గొనవచ్చు. మీరు మీ లక్ష్యాల వైపు స్థిరంగా ఉంటారు. వ్యాపార పర్యటనకు బలమైన అవకాశం ఉంది. మీరు నమ్మదగిన వ్యక్తుల నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. వైవాహిక సంబంధాలలో అంకిత భావంతో ఉంటారు. వ్యాపారస్తులకు టైమ్ పెద్దగా కలసిరాదు. కార్యాలయంలో కుట్రదారుల పట్ల జాగ్రత్త వహించండి. మీ ప్రేమికుడి భావాలను గౌరవించండి. ఎటువంటి కారణం లేకుండా మనస్సు కొద్దిగా విచారంగా మారవచ్చు. మీ విషయాలలో ఇతరుల జోక్యం కారణంగా కోపంగా ఉండవచ్చు. ఉదర సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రిస్క్‌తో కూడిన పెట్టుబడుల వల్ల ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లవచ్చు. యోగా, ధ్యానం తప్పనిసరిగా చేయాలి. Gemini Year Astrology Prediction 2025
కర్కాటక రాశి వారఫలం (Cancer Weekly Horoscope)
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం మంచి లాభాలు పొందుతారు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. సరైన సమయ నిర్వహణ వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో బాధ్యతాయుతమైన స్థానం లభించే అవకాశం ఉంది. సామాజిక సంస్థలలో చేరడానికి ప్రయత్నిస్తారు. మీ ముఖ్యమైన పనులు ఈ వారం పూర్తి కాగలవు. పాత స్నేహితులను కలుస్తారు. న్యాయవాదులు పెద్ద కేసులను పొందుతారు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడతారు. ఒంటరిగా సమయం గడపడానికి ప్రయత్నించండి. అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. స్పైసీ ఫుడ్ తినవద్దు. సంబంధాల విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉంటారు. కంటి వ్యాధులు రావచ్చు. కొన్ని కారణాల వల్ల పాత స్నేహితుడితో గొడవలు రావచ్చు. ఖర్చు చేసేటప్పుడు ఎల్లప్పుడూ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోండి. Cancer Year Astrology Prediction 2025
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.