Weekly Horoscope 15-21 May 2023: మే మూడో వారంలో ఈ రాశులవారికి ఆస్తి ప్రయోజనాలున్నాయి, మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు
Weekly Horoscope 15-21 May 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Weekly Horoscope 15-21 May 2023: మే మూడో వారంలో ఈ రాశులవారికి ఆస్తి ప్రయోజనాలున్నాయి, మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు
మే 15 సోమవారం నుంచి మే 21 ఆదివారం వరకూ వారఫలాలు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. కార్యాలయంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ప్రశంసలు పొందుతారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కెరీర్ జోరందుకుంటుంది. మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ వారం మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి.
వృషభ రాశి
ఈ వారం ఈ రాశి వారికి ధనం, గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఈ వారం ఆస్తి ప్రయోజనం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాకింగ్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కోర్టులో ఏదైనా వివాదం నడుస్తుంటే అందులోనూ విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి
రాబోయే వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల కారణంగా కొన్ని పనులు ఆగిపోవచ్చు. సంతానం కారణంగా సంతోషం, ఆదాయం పెరుగుతుంది. ఈ వారం చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. నూతన పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. మీ వైవాహిక జీవితం విజయవంతమవుతుంది.
Also Read: ఆంజనేయుడి జన్మరహస్యం గురించి ఏ పురాణంలో ఏముంది!
కర్కాటక రాశి
ఈ వారం మీపై పనిఒత్తిడి ఉంటుంది. మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ వారం మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆదాయం కూడా తగ్గుతుంది. భాగస్వామితో కొనసాగుతున్న వైరం ఈ వారం ముగిసే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలున్నాయి.
సింహ రాశి
వారం ప్రారంభం బాగుంటుంది. ఎలాంటి వివాదాలు లేకుండా మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ వారం మీ అనేక ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనేక కొత్త ప్రయోజనాలను కూడా పొందుతారు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకెళితే పనులు పూర్తవుతారు. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబం సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు ఈ వారం ధన,ఆస్తి ప్రయోజనం పొందుతారు. మీ పనులన్నీ క్రమబద్ధంగా ఉంటాయి. ఏదో భయం, ఆందోళన ఉంటాయి. మీ ప్రణాళికలు చాలావరకు విజయవంతమవుతాయి. కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. ఆదాయం బావుంటుంది. ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయంలో భాగస్వామితో కొంత వివాదం ఉండవచ్చు.
తులా రాశి
ఈ రాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ మనస్సు ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతుంది. పని పట్ల అయిష్టత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆదాయం బావుంటుంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగిసిపోతాయి.
వృశ్చిక రాశి
ఈ వారం వృశ్చిక రాశి వారు మానసికంగా కుంగిపోతారు. మీ ఆదాయం తగ్గేఅవకాశం ఉంది కానీ పెండింగ్ మనీ మీ చేతికందుతుంది. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. మీ పాత ప్రణాళికలు విజయవంతమవుతాయి. వారం చివరిలో, కొన్ని ప్రతికూల ఆలోచనలు గుర్తుకు వస్తాయి. పాత భాగస్వామిని కలుస్తారు.
Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!
ధనుస్సు రాశి
ఈ రాశివారికి దీర్ఘకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. మీ ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆనందం లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం మీకు సన్నిహితంగా ఉండే వారి చేతుల్లోనే మీరు మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
ఈ వారం శాశ్వత ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పాత కష్టాలన్నీ సమసిపోతాయి. మీ ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతారు. చట్టపరమైన విషయాల్లో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు సీనియర్లతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనిలో విజయం సాధిస్తాయి. ఈ వారం విలువైన వస్తువులను కాపాడుకోండి. మీ వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి.
కుంభ రాశి
ఈ వారం మీ పనుల్లో అనవసర జాప్యం జరుగుతుంది...అందువల్ల మీకు కోపం పెరుగుతుంది. పనులు వేగవంతం అవుతాయి. ఈ వారం బిజీగా ఉంటుంది. మీ వివాదాలను పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. ప్రేమ పరంగా ఈ వారం మీకు మంచిది కాదు. ఉద్యోగులు, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మామూలుగా ఉంటుంది. మీ పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే, ఆకస్మిక ధనలాభం కూడా పొందవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు మరింత కష్టపడాలి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.