News
News
వీడియోలు ఆటలు
X

Hanuman Jayanti 14th May 2023: ఆంజనేయుడి జన్మరహస్యం గురించి ఏ పురాణంలో ఏముంది!

Hanuman Jayanti 14th May 2023: వైశాఖ బహుళ దశమి (మే 14) రోజున ఆంజనేయుడు జన్మించాడు. చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం..వైశాఖ మాసంలో వచ్చేది హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

FOLLOW US: 
Share:

Hanuman Jayanti 14th May 2023: మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ హనుమంతుడిని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు భక్తులు. అంజనాదేవి గర్భాన జన్మించడం వల్ల ఆంజనేయుడయ్యాడు. అయితే ఆంజనేయుడి పుట్టుక వెనుక పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పారు. శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత గ్రంథాల్లో విభిన్నంగా పేర్కొన్నారు. 

హనుమంతుడి జన్మ రహస్యం

శ్రీమహావిష్ణువు అవతారాల్లో పరిపూర్ణ అవతారం రాముడు. అలాంటి రాముడి కార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు వీర్య స్కలనం చేయగా.. ఆ స్కలనాన్ని  సప్తర్షులు.. గౌతముడి కుమార్తె అయిన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలుగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం తెలిపింది. అలా శివుడి అంశతో పుట్టాడు హనుమంతుడు..అందుకే హనుమంతుడిని శివసుతుడిగా వర్ణించింది రుద్ర సంహిత. ఆత్మావై పుత్రనామాసి అనే సూక్తి ప్రకారం హనుమంతుడిని శివనందనుడిగా, శివావతారుడిగా కీర్తిస్తారు. శివుడి పదకొండో అవతారమే హనుమంతుడు అని  పరాశర సంహిత ధృవీకరించింది. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహా విష్ణువు పరమశివుడికి సహకరించినందున..అందుకు రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది.

Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!

వాయుపుత్రుడు అంటారెందుకు

రాక్షస సంహారం కోసం శ్రీ మహా విష్ణువు సూచనమేరకు త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. శివుడి వీర్యాన్ని పార్వతీ భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఓ పండుగా మలిచి పుత్రుడికోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆపండు తిన్న ఫలితంగా అంజనాదేవి గర్భం దాల్చి కుమారుడిని ప్రసవించింది. వాయు ప్రసాదంతో జన్మించిన వాడు కావడం వల్ల వాయుపుత్రుడు అయ్యాడు. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టాడు కనుక అంజనాదేవి కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

వాల్మీకి రామాయణం ప్రకారం

దేవలోకంలో పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి, వానరరాజైన కేసరి భార్య అయింది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి మోహితుడైన వాయుదేవుడు ఆమెను కౌగలించుకుంటాడు. తన మనసుతో ఆమెకు దగ్గరవుతాడు. తన వ్రతం భంగమైనందని అంజనాదేవి బాధపడగా...ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు . అలా వైశాఖ బహుళ దశమినాడు ఆంజనేయుడికి జన్మనిచ్చింది అంజనాదేవి. 

Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!

సూర్యుడితో సమానమైన తేజస్సు

ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆంజనేయుడు పండుగా భావించి తినేందుకు ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే  హనుమంతుడనే పేరు వచ్చింది . అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. 

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః
శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం
భోగశ్చ, మోక్షశ్చ, కరస్త యేవ”
అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కాని శ్రీహనుమ సేవాతత్పరులైన వారికి భోగమూ, మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం” అను గ్రహించాడు. 

Published at : 13 May 2023 06:00 AM (IST) Tags: HANUMAN Surya hanuman jayanthi Hanuman Jayanti 14th May 2023 importance of surya anjaneyam Hanuman Surya Relationship significance of kondagattu anjaneya swamy

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?