అన్వేషించండి

Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మకర రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025

Ugadi Panchangam 2024 -2025: ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది మకర రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Capricorn Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం  మకర రాశి వార్షిక ఫలితాలు

మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1

మకర రాశివారికి ఈ ఏడాది గురుడు శుభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మీకు ఏల్నాటి శని ఉంది. రాహుకేతులు శుభస్థానంలో, కుజుడు అర్థాష్టమంలో ఉన్నారు. ఈ గ్రహ సంచారం ప్రభావంతో ఏ పని చేసినా బ్యాలెన్స్ గా చేస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎంతటి పని చేపట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. మీపై మీకున్న నమ్మకం,మీ ధైర్యం మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది..ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అన్ని రంగాలవారికి కలిసొచ్చే సమయం..స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఇంట్లో మార్పులు చేస్తారు. స్వల్పంగా నష్టాలు, ప్రయాణంలో చికాకులు తప్పవు...

మకర రాశి ఉద్యోగులకు

ఈ రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం  ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. మొదటి ఆరు నెలల్లో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు, అపవాదులు ఎదుర్కొంటారు.  దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. అయితే ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు అనుకూలం అవుతాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి జీతంతో వేరే కంపెనీలకు మారుతారు. ఏడాది చివరినాటికి నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. 

Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు నిముషాల్లో ఖర్చుచేసేస్తారు - నరఘోష చాలా ఎక్కువ - శ్రీ క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు!

మకర రాశి వ్యాపారులకు

మకర రాశి వ్యాపారులకు శ్రీ క్రోధి నామసంవత్సరం శని బలం కలిసొస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం. కాంట్రాక్టు పనులు చేస్తున్నవారికి కూడా ఈ ఏడాది బాగా కలిసొస్తుంది. బంగారం వెండి వ్యాపారులకు ఆగష్టు తర్వాత నుంచి బావుంటుంది. 

మకర రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు ఏడాది ఆరంభం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభంలో రాసిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధించలేరు. మొదటి ఆరు నెలల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాసినా ఇదే పరిస్థితి. సెప్టెంబరు తర్వాత నుంచి చదువులో రాణిస్తారు, పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు

Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా ఈ ఉగాది నుంచి తిరుగులేదంతే - శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు!

మకర రాశి కళాకారులకు

ఈ రాశి కళాకారులకు యోగదాయకమైన కాలం. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా అడుగు ముందుకేస్తారు. ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులు, రివార్డులు పొందుతారు.

మకర రాశి వ్యవసాయ దారులకు

మకర రాశి వ్యవసాయ దారులకు మొదటి పంట కన్నా రెండో పంట కలిసొస్తుంది. సెప్టెంబరు తర్వాత నుంచి అప్పుల బాధలు తీరుతాయి. కౌలుదార్లకు పర్వాలేదు.

Also Read:  శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!

మకర రాశి రాజకీయనాయకులకు

ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు.పార్టీలో, ప్రభుత్వంలో మీరు భాగమవుతారు. మిమ్మల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారికి నిరాశే మిగులుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఓవరాల్ గా చెప్పుకుంటే మకర రాశి వారికి శ్రీ క్రోధి నామసంవత్సరం మొదటి ఆరు నెలలు కన్నా చివరి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది. ఏలినాటి ప్రభావం తగ్గడం, గురుడు బలంగా ఉండడం వల్ల సమస్యలున్నా అధిగమిస్తారు. మీపై అందరికి ఈర్ష్య, అసూయ ఉంటాయి...

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Embed widget