Today Horoscope In Telugu: జులై 15 రాశి ఫలితాలు: ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
Horoscope Prediction 15th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. జులై 15 (సోమవారం నాడు) రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![Today Horoscope In Telugu: జులై 15 రాశి ఫలితాలు: ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది today rasi phalalu horoscope in telugu for july 15th 2024 aries to pisces zodiac sign holi astrology predictions Today Horoscope In Telugu: జులై 15 రాశి ఫలితాలు: ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/14/95ac560da1855c3380ef29bbb8ba415a1720973199653879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope for july 15th 2024: మేషం
ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో లాభాలు ఉంటాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.
వృషభం
ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువుల నుంచి కొన్ని విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మిథునం
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు.
కర్కాటకం
ఈ రాశి వారు ఈరోజు మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇంటా బయట అదనపు బాధ్యతల పెరిగి చికాకు కలిగిస్తాయి. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక ట్రాన్స్‌ఫర్ లు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సింహం
ఈ రాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి.
కన్య
ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో రెండు రకాల ఆలోచనలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి., వృత్తి వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశలు తప్పవు.
తుల
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుక సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ది కలుగుతుంది.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈరోజు కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులు ఓర్పుతో ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంది.
ధనస్సు
ఈ రాశి వారు ఈరోజు భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ది కలుగుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.
మకరం
ఈ రాశి వారికి ఈరోజు ధన పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు.
కుంభం
ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు.
మీనం
ఈరాశి వారు ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
Note: ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: జేబులో పొరపాటున కూడా ఈ 5 వస్తువులు పెట్టుకోకండి - దరిద్రం పట్టుకుంటుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)