Today Rasi Phalalu : శ్రీరామనవమి రోజు ఈ రాశులవారిపై రాముడి కరుణా కటాక్షాలుంటాయి - సమస్యలు దూరం , అనుకోని ఆదాయం!
Today Horoscope in Telugu (17/04/2024) : రోజువారీ జాతకంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఏప్రిల్ 17న కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి.....
Daily Horoscope for April 17th 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశి ఫలితాలను చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.... ఈ రోజు ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఎవరికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....
మేష రాశి
కుటుంబం , స్నేహితులతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ వృత్తి జీవితంలో మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకు నచ్చిన పని చేసేందుకు కొంత సమయం కేటాయించండి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. యోగా, ధ్యానంపై దృష్టి సారించాలి.
Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!
మిథున రాశి
విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశివారి సామాజిక హోదా పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులొస్తాయి. కార్యాలయ పనిపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు కొంత ఆలోచన చేయండి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా సంతోషం రెట్టింపవుతుంది.
Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!
సింహ రాశి
ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో సక్సెస్ అవుతారు..పనితీరుకి ప్రశంసలు పొందుతారు. సీనియర్ల సహకారంతో కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
కన్యా రాశి
మీరు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. జీవనశైల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన సమయం ఇది. ఆరోగ్యకరమైన దినచర్యని అనుసరించండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కెరీర్లో అద్భుతమైన విజయం సాధిస్తారు...ఇంట్లో సంతోషకరమైన వాతావారణం ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీకు ఊహించని ఆదాయవనరుల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తి , ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ వ్యక్తిత్వం ప్రశంసనీయంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారి వృత్తి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. జీవితంలో ఉత్సాహానికి లోటుండదు. సహోద్యోగులు మీ పనితీరు చూసి స్ఫూర్తి పొందుతారు. కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలు వరిస్తాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపండి. భూమి లేదా వాహన కొనుగోలుకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.
Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!
ధనుస్సు రాశి
అదనపు ఖర్చులపై నిఘా ఉంచండి. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడిపే క్షణాలను ఆస్వాదిస్తారు. ఆర్తిక సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు.
మకర రాశి
పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. మీ జీవనశైలి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది
Also Read: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే!
కుంభ రాశి
వృత్తి జీవితంలో మంచి పనితీరు కనబరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. ఈ రోజు మీరు ఓ ఆసక్తికరమైన వ్యక్తిని కలుస్తారు. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించండి
మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఓ శుభవార్త అందుకుంటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. బంధువులతో ఉన్న విబేధాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ప్రారంభమవుతాయి.
గమనిక: ఓ రాశిలో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు...మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...
Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!