అందుకే అయోధ్య రాముడు ఆదర్శ పురుషుడు శ్రీరాముడు మానవుడిగా జన్మించాడు..ఎక్కడా దైవత్వం చూపించకుండా మానవుడిలానే పెరిగాడు ఓ మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాడు..కానీ ఎక్కడా తొణకలేదు, ధర్మాన్ని వీడలేదు, అసత్యం చెప్పలేదు. దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారంలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించలేదు “రామస్య ఆయనం రామాయణం” అంటారు..ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం సాధారణ మానవుడిలా జన్మించి..చివరకు మానవుడిలానే అవతార పరిసమాప్తి చేశాడు అందుకే రాముడి ప్రతి అడుగు ఆదర్శం...రాముడే ఆదర్శ పురుషుడు... జై శ్రీరామ్.... Images Credit: Freepik