అన్వేషించండి

Horoscope Telugu 13th November 2023: నవంబరు 13 అమావాస్య రోజు మేషం నుంచి మీనం వరకూ రాశిఫలాలు

Today Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 13, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today Telugu 13th November (దిన ఫలాలు నవంబర్ 13, 2023)

మేష రాశి (Aries Horoscope in Telugu)

ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు.  భవన నిర్వహణ, అలంకరణకు ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినా మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 

వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మేధోపరమైన పని నుంచి ఆదాయం ఉండొచ్చు.  ప్రేమ సంబందాలకు సంబంధించి మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి సమయం. కుటుంబానికి సమయం కేటాయించాలి. మీ సహజ స్వభావం అందరికీ నచ్చుతుంది. కానీ విశ్వసనీయత విషయంలో మీపట్ల అభిప్రాయం మారకుండా జాగ్రత్తపడండి. 

మిథున రాశి (Gemini Horoscope in Telugu)

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు...కానీ కొన్ని విషయాల్లో స్వీయ నియంత్రణ పాటించాలి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ బంధంలో ప్రేమ లోపించవచ్చు. రెగ్యులర్ దినచర్యతో విసుగుచంది సాహసం చేయాలనే ఆలోచనలతో ఉంటారు. 

Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!

కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)

అనవసర తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర పరుగులు తీయొద్దు. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమఫలితాలున్నాయి. 

సింహ రాశి ( Leo Horoscope in Telugu)

ఈ రాశివారు అనవసర కోపానికి దూరంగా ఉండాలి. విద్యార్థులకు చదువులో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణం చేసే అవసరం రావొచ్చు. ఆదాయం తగ్గుతుంది. కొత్త ప్రేమను వెతుక్కోవద్దు..ఉన్న ప్రేమను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. అవివాహితులు తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న భాగస్వామిని వెతకడంలో బిజీగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)

ఈ రాశివారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పాలక యంత్రాంగం నుంచి సహాయం అందుతుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ, బంధానికి సంబంధించిన విషయాల్లో మీ మాట కన్నా మీ చర్యలు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. మీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. 

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

తులా రాశి (Libra Horoscope in Telugu)

ఈ రోజు ఈ రాశివారి  కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యా , పరిశోధన పనుల కోసం వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.  మీరు మీ సంబంధాల విషయంలో రాజీ పడుతున్నట్లు మీకు అనిపిస్తే మరోసారి ఆలోచించండి. ఏవైనా ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిది,

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)

ఈ రాసివారు కాస్త ఓపికగా వ్యవహరించాలి. అనవసర కోపం తగ్గించుకోవాలి. మాటల్లో సమతుల్యతను కాపాడుకోవాలి. ఈరోజు మీరు పాతస్నేహితుడిని కలుస్తారు.  కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ప్రేమ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ అభిరుచులు మరియు ఆసక్తులను కొనసాగించండి. ఈ ఆరోగ్యకరమైన స్వాతంత్ర్యం మీకు సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)

ఈ రాశివారి మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి. ఓపికపట్టండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మేథోపరమైన వ్యవహారాలు సంతోషరమైన ఫలితాలను ఇస్తాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ప్రతి సంబంధానికి పెద్ద మార్పులు లేదా పరివర్తన అవసరం లేదని గుర్తించండి. 

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

మకర రాశి (Capricorn Horoscope in Telugu)

ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రచన - మేధోపరమైన పనిలో నిమగ్నత పెరుగుతుంది, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒంటరి వారు జంటను వెతుక్కునేందుకు ఇదే మంచి సమయం.  మీ ఉల్లాసభరితమైన స్వభావం అందర్నీ ఆకర్షిస్తుంది. ఎవ్వరినీ ఎగతాళి చేయొద్దు, ప్రలోభ పెట్టొద్దు. 

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)

 ఈ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ఓపిక పట్టేందుకు ప్రయత్నించండి.  అదనపు ఖర్చులు ఉంటాయి. మతపరమైన సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు సంబంధాలలో చేసిన తప్పులను విశ్లేషించుకోండి. మీ గత సంబంధాలు ఎందుకు పేలవంగా ముగిసాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!

మీన రాశి (Pisces Horoscope in Telugu)

మీ మాటలో మాధుర్యం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ప్రయత్నించాలి, ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి రావొచ్చు. ఈ రోజు మీరు మీకు అత్యంత సన్నిహితుల నుంచి అసమ్మతిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే సమస్య పెంచుకోవడం కన్నా పరిష్కరించుకోవడం ఉత్తమం..మీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకండి..కలసి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Bajaj Platina 100 : ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
Japan Earthquake News: నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
Tatamel Bike: ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Embed widget