అన్వేషించండి

Surya Grahan 2024 Date Time: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది!

Surya Grahan 2024: 2024 అక్టోబరు 02 బుధవారం భాద్రపద అమావాస్య రోజు కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణ సమయాలు, ఏ రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం

Surya Grahan 2024 Negative Effect: గ్రహణాలను హిందూమతంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణ ప్రారంభానికి 12 గంటల ముందే సూతకాలం ప్రారంభం అవుతుంది. చంద్రుడు - సూర్యుడు - భూమి ఎదురెదురుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే భారతకాలమానం ప్రకారం అక్టోబరు 02 బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మొదలై తెల్లవారు జామున మూడున్నర సమయానికి ముగుస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు..ఫలితంగా సూతకాలం, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.  అమెరికా, ఫోర్చుగల్, పసిఫిక్ మహాసముద్రం, ఈజిప్టు, రొమేనియా, ఇటలీ, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా సహా పలు దేశాల్లో గ్రహణం చూడొచ్చు.

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!

ఈ సూర్య గ్రహణం నాలుగు రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపించనుంది...ఆ రాశుల్లో మీరున్నారా?
  
మేష రాశి

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఇస్తోంది. ప్రేమికుల మధ్య తగాదాలుంటాయి. పెళ్లిచేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు కొన్ని రోజుల పాటూ ఆ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఉద్యోగులు ఒత్తిడి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ప్రస్తుత సమయంలో పెట్టకపోవడమే మంచిది. 

మిథున రాశి

సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావం మిథున రాశివారిపై ఉంటు్ంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల సలహాలు ఆధారంగా పెద్దగా పెట్టుబడులు పెట్టొద్దు. మీ కోపాన్ని, మీ ప్రవర్తను నియంత్రించండి. 

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

కర్కాటక రాశి

కర్కాటక రాశివారిపై సూర్యగ్రహణ ప్రభావం ఆర్థికంగా చూపిస్తుంది. సమయానికి చేతికి డబ్బు అందదు. అనుకోని ఖర్చులుంటాయి. ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పవు. అనవసర ఖర్చులు అదుపుచేయాల్సిన సమయం ఇది. అప్పులు చేయవద్దు. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.  

సింహ రాశి

మీ రాశికి అధిపతి సూర్యుడు..అందుకే సూర్య గ్రహణ ప్రభావం మీ రాశిపై అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మానసికంగా కుంగిపోతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయండి.  

Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

చంద్రగ్రహణం కన్నా సూర్య గ్రహణం పవర్ ఫుల్ అని నమ్ముతారు...సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే చంద్రగ్రహణం కన్నా సూర్య గ్రహణం సూతకాలం ఎక్కువ సమయం ఉంటుంది. సూతకాలం ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి పూజలు చేయరు. దేవతా విగ్రహాలను ముట్టుకోరు. ఆలయాలు మూసివేసేది కూడా ఇందుకే. అయితే గ్రహణం మనదేశంలో కనిపించనప్పుడు సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget