Horoscope Today 16 Augsut 2024: ఆగష్టు 16 శ్రావణ శుక్రవారం..ఈ రాశులవారిపై లక్ష్మీకటాక్షం!
Horoscope Prediction 16 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 16 August 2024
మేష రాశి
ప్రారంభించిన పని సజావుగా సాగుతుంది. ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. సానుకూల స్వభావం ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక రాదు అనుకున్న మొత్తాన్ని తిరిగి పొందుతారు.
వృషభ రాశి
ఈ రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఆశించవద్దు. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. మీ భవిష్యత్ ప్రణాళికలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచడం మంచిది. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవద్దు.
మిథున రాశి
ఈ రోజంతా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి లావాదేవీలకు ఈ రోజు మంచి రోజు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేస్తారు. స్నేహితుల సలహాలు తప్పకుండా తీసుకోండి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన ప్రదేశాలు సందర్శించేందుకు వెళతారు.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మొత్తం పూజా విధాన మంత్రాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....
కర్కాటక రాశి
ఈ రోజు రిస్క్‌లు తీసుకోవడం వల్ల నష్టాలు రావచ్చు. సన్నిహితుల నుంచి చెడు సమాచారం అందే అవకాశం ఉంది. అనవసర వాదనలకు దూరంగా ఉండండి..మీరు నమ్ముతున్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
సింహ రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త సమాచారాన్ని పొందుతారు. ప్రియమైనవారితో ఒక ప్రత్యేక అంశంపై చర్చిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తారు. మీరు సామాజిక సేవలో ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ఆలోచనల్లో శ్రేష్ఠత ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజంతా మీ ఆలోచనల్లో ఆధ్యాత్మికత నిండిఉంటుంది. తెలివైన నిర్ణయాల వల్ల మీరు భారీ లాభాలను పొందుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి.
తులా రాశి
ఈ రోజు వ్యాపార పనులు అసంపూర్తిగా ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ స్థాయిని మించి ఖర్చు చేయవద్దు. ఒక నిర్దిష్ట వ్యక్తికి సంబంధించి మీ మనసులో కొన్ని భిన్నమైన ఆలోచనలు రావచ్చు.
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. కొందరు వ్యక్తుల జోక్యం వల్ల మీ పనికి ఆటంకం కలుగుతుంది. మనసులో చాలా సందేహాలుంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
ధనస్సు రాశి
మీ దినచర్యను క్రమశిక్షణలో ఉంచుకోండి. స్నేహితులకు సహాయం చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నా కానీ..మీ మనసు చెప్పిందే వినండి. కెరీర్లో పురోగతికి అకాశాలున్నాయి. సాధించిన విజయాలతో సంతృప్తి చెందుతారు.
మకర రాశి
ఈ రోజంతా పనుల్లో బిజీగా ఉంటారు..ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో చేసే పనుల్లో తొందరపాటు వద్దు. సృజనాత్మక ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
కుంభ రాశి
ఈ రాశివారు ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరగవచ్చు. సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉంటుంది.
మీన రాశి
మారుతున్న వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవలసి వస్తుంది. మీ లక్ష్యాలపై మీకు స్పష్టత ఉండాలి. కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు..
Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.