Shukra Gochar 2025 : కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం, 12 రాశుల ధన, ఆరోగ్య, వైవాహిక జీవితంలో వచ్చే మార్పులు ఇవే!
Shukra Gochar 2025 : విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఆగష్టు 20 నుంచి సెప్టెంబరు 13 వరకూ కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈసమయంలో మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

Venus Transit in Cancer : శుక్రుడి ఈ గోచారం ప్రభావం ఆగష్టు 20 నుంచి సెప్టెంబరు 13 వరకూ 12 రాశులపై ఎలా ఉంటుంది?
మేష రాశి
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం మీకు అనుకూలంగా లేదు. ఇది మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది. మీ సంతోషాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి లేదంటే ధననష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఈ గోచారం కొంత మెరుగ్గా ఉంటుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన చర్చలు కొన్ని ఆటంకాల తర్వాత పూర్తవుతాయి. కర్మభావంపై శుభ దృష్టి కారణంగా పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి
మీ ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి. ఇంట్లో మీ బంధువులతో వాగ్వాదం ఉండవచ్చు. శుక్రుడి దృష్టి భాగ్య భావంపై ఉండటం వల్ల ధర్మకర్మల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు, యాత్రల వల్ల ప్రయోజనం ఉంటుంది. విదేశీ కంపెనీలలో సర్వీస్ కోసం ప్రయత్నించడం లేదా విదేశీ పౌరసత్వం కోసం వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా విజయవంతమవుతుంది.
మిథున రాశి
కర్కాటర రాశిలో శుక్రుడి సంచారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది. అదే సమయంలో మీ శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులను కూడా బయటే పరిష్కరించుకోవడం మంచిది. మీ సామాజిక ప్రతిష్టను పెంచే పని చేస్తారు.
కర్కాటక రాశి
మీ మనస్సు కొంచెం కలత చెందుతుంది. ఏదో ఒక విషయం గురించి మనస్సులో ఆందోళన ఉండవచ్చు. అయితే మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా లేదా ఒప్పందంపై సంతకం చేయాలన్నా, సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి.
సింహ రాశి
శుక్రుడి గోచారం మీ ఖర్చులను పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం దృష్ట్యా కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అధిక ప్రయాణం కారణంగా అలసటగా ఉంటారు. వారి దృష్టి శత్రు భావంపై ఉండటం వల్ల మీ రహస్య శత్రువులు పెరుగుతారు, కానీ కోర్టు కేసులలో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు లేదా ఏదైనా రుణదాత నుంచి రుణం తీసుకోకండి.
కన్యా రాశి
మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, కానీ బంధువులతో వివాదం పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, చాలా కాలంగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికందుతుంది. వారి దృష్టి పంచమ భావంపై ఉండటం వల్ల సంతానం గురించి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి ఉంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు. అయితే, ఇందులో జాగ్రత్త వహించడం కూడా అవసరం.
తులా రాశి
కర్మ భావంలో శుక్ర గోచారం మీకు విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి ప్రభావం పెరుగుతుంది, స్థాన మార్పు కూడా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులను పరిష్కరిస్తారు. పరిపాలన అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఎన్నికలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఇది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోండి. వారి శుభ దృష్టి నాల్గవ భావంపై పడటం వల్ల స్నేహితులు లేదా బంధువుల నుంచి సహకారం, భౌతిక సుఖాల పెరుగుదల కూడా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీరు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులను పరిష్కరిస్తారు. విదేశీ కంపెనీలతో సర్వీస్ కోసం ఒప్పందం పొందడం విదేశీ పౌరసత్వం కోసం వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా విజయవంతమవుతుంది. ధర్మకర్మల పట్ల ఆసక్తి చూపుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు ప్రశంసలు అందుకుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం ధనస్సు రాశివారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గుండె, పొట్ట సంబంధిత వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఇది మీకు గౌరవాన్ని పెంచుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి పనిచేసే ప్రదేశంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం , ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ధన భావంపై దృష్టి ప్రభావం కారణంగా, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు
మకర రాశి
శుక్రుడి సంచారం మకర రాశివారి వైవాహిక జీవితంలో కొంత చేదును తీసుకువస్తుంది. వివాహానికి సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. వ్యాపారులకు ఉత్తమంగా ఉంటుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలలో సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా కొత్త ఒప్పందంపై సంతకం చేయడం కూడా మంచిది. ప్రయాణాలు వల్ల ప్రయోజనం ఉంటుంది, విదేశీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా విజయవంతమవుతుంది. లగ్న భావంపై వారి శుభ దృష్టి ప్రభావం కారణంగా, గౌరవం పెరుగుతుంది .. మీ నిర్ణయాలు కూడా ప్రశంసలు అందుకుంటాయి
కుంభ రాశి
కర్కాటకంలో శుక్రుడి సంచారం సమయంలో మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మీ సొంతవారే మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు, మీపై ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం , తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. కోర్టు కేసులను కూడా బయటే పరిష్కరించుకోవడం మంచిది. విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు అవుతుంది, బాధాకరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. విదేశీ కంపెనీలు విదేశాలలో నివసిస్తున్న స్నేహితుల నుంచి లాభం ఉంటుంది.
మీన రాశి
విద్యారంగంలో మీరు విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధిత విషయాల్లో మనస్పర్థలు పెరగుతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి మరింత ప్రయత్నించాలి. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి, సంతానానికి సంబంధించిన ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుక్రుడి దృష్టి లాభ భావంపై ఉండటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొంచెం కష్టపడితే కూడా ఎక్కువ లాభం పొందుతారు
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















