అన్వేషించండి

2024 Horoscope Today 6 Augsut: ఆగష్టు 06 శ్రావణ మంగళవారం ఈ రాశులవారు శుభవార్తలు వింటారు!

Horoscope Prediction 6 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 6 August 2024

మేష రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. 

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అడ్డంకులు తప్పవు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉండదు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు లేవు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. 
 
మిథున రాశి 

ఈ రోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు. మీ పనితీరును మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. సోదరులు ,  స్నేహితుల పట్ల మంచి ప్రవర్తనను కొనసాగించండి. మీరు మీ ప్రియమైన వారితో ఎక్కడికైనా  వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు లాభపడతారు. 
 
కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారి స్వార్థపూరిత వైఖరి కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. ఇంటి పని - కార్యాలపని కారణంగా తీవ్రంగా అలసిపోతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. గుండె సంబంధిత రోగాలున్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. 

Also Read: పుట్టలో పాలు పోయెచ్చా - పోయకూడదా..నాగులు , సర్పాలకు వ్యత్యాసం ఏంటి!

సింహ రాశి

ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. నూతన  వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఆన్‌లైన్ వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. 

కన్యా రాశి 

ఈ రోజు ప్రయాణంలో సమస్యలు ఎదురుకావొచ్చు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు, మీరు తీసుకోవద్దు. సరిపడా నిద్రలేకపోవడం వల్ల ఇబ్బందిపడతారు. మీ మాటలు ఎదుటివారికి కోపాన్ని కలిగిస్తా

తులా రాశి

ఈ రోజు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. 

Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

వృశ్చిక రాశి 

ఈ రోజు గౌరవం తగ్గవచ్చు. మీకు హాని కలిగించడానికి ప్రయత్నించేవారున్నారు జాగ్రత్త.  ప్రణాళికాబద్ధంగా పని చేయడం మంచిది. కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు.

ధనుస్సు రాశి

ఇంటా బయటా మీకు ఆదరణ పెరుగుతుంది. ఇంటి పెద్దల మాట తప్పకుండా పాటించండి. మీరు మీ పనులన్నీ ప్రశాంతంగా చేయాలి. మీ యువత తమ కెరీర్‌లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. 

మకర రాశి 

ఈ రోజు కార్యాలయంలో ఒత్తిడి ఉంటుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన లోపం ఉండవచ్చు. మీ సహోద్యోగులతో మర్యాదగా  వ్యవహరించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞువ సలహాలు స్వీకరించండి. 

కుంభ రాశి

ఈ రోజు కుటుంబ సంతోషం పెరుగుతుంది. కార్యాలయంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.  శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. మానసికంగా చాలా రిలాక్స్‌గా ఉంటారు. 

మీన రాశి

ఈ రాశి వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు.  ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.   అప్పులు తీర్చేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.  సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ అభిరుచులను నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. వృత్తి జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.

Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Abbas Re Entry: 'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
Christmas OTT Releases: 'ఆంధ్ర కింగ్ తాలూకా' vs 'రివాల్వర్ రీటా'... ఓటీటీల్లో క్రిస్మస్ పండక్కి మీ ఛాయస్ ఏది?
'ఆంధ్ర కింగ్ తాలూకా' vs 'రివాల్వర్ రీటా'... ఓటీటీల్లో క్రిస్మస్ పండక్కి మీ ఛాయస్ ఏది?
Embed widget