Numerology Predictions 11 October 2022: ఈ తేదీల్లో పుట్టిన వారి కోర్కెలు నెరవేరుతాయి, అక్టోబరు 11 న్యూమరాలజీ
Numerology prediction 11st October 2022 : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈరోజు( అక్టోబరు 11) ఎవరెవరికి కలిసొస్తుంది? న్యూమరాలజీ నిపుణులు ఏం చెప్పారో..ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
Numerology prediction 11th October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 11 మంగళవారం రోజు....ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీపై మీకు నమ్మకం కలుగుతుంది. మీ సమర్థత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ప్రేమ సంబంధాలు సన్నిహితంగా ఉంటాయి.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ రోజు ప్రారంభంలో మీ ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. అతి విశ్వాసం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువుపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ రోజు మీకు మంచి రోజు. ఖర్చులను నియంత్రించండి. ఈ సమయంలో చేసే ప్రణాళిక సమీప భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిస్తాయి. బయటి వ్యక్తుల జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వైవాహిక బంధంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
విద్యార్థులు పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. మీ సమయానని సద్వినియోగం చేసుకోండి. కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. కార్యాలయంలో చిన్న చిన్న వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వలేరు.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగేందుకు ఇదే సరైన సమయం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చిన ఫలాలను పొందడం ద్వారా ఆనందం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి, కుటుంబంతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. దినచర్యలో మార్పు మీకు సానుకూలంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం ఎక్కువవుతుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది. అనవసర విషయాలపై ఎక్కువ చర్చించవద్దు. బయటి వ్యక్తుల ప్రభావం మీపై లేకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
కుటుంబ సభ్యుల్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఏదైనా ఖర్చుచేసేముందు ముందుగా బడ్జెట్ ను ప్లాన్ చేసుకోండి. ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు సక్సెస్ అవుతారు. మీ కోర్కె నెరవేరుతుంది.