1 అక్టోబర్ 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 01న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 01 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 1 October 2025
మేష రాశి
ఈ రోజు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. మీ పాత పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం కోసం మీరు ఒక పని ప్రణాళికను తయారు చేసుకోవచ్చు..సక్సెస్ అవుతారు. కుటుంబంలో కొన్ని విషయాలపై విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
శుభ సంఖ్య: 5
రంగు: ఎరుపు
పరిహారం: శివుడికి అభిషేకం చేయండి
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. మీరు కొత్త వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ప్రత్యేక పని కారణంగా సుదూర ప్రయాణం చేయవలసి రావచ్చు. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఓ శుభవార్త అందుతుంది.
శుభ సంఖ్య: 9
రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవి పూజ చేయండి
మిథున రాశి
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు సీజనల్ వ్యాధుల బారినపడతారు. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవద్దు నష్టం జరగుతుంది. షేర్ మార్కెట్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు.
శుభ సంఖ్య: 7
రంగు: ఆకుపచ్చ
పరిహారం: తులసి మాతకు నీరు సమర్పించండి
కర్కాటక రాశి
ఈ రోజు మీరు అనవసరమైన వివాదంలో చిక్కుకోవచ్చు..మాటలు అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయవద్దు, నష్టం కలిగే అవకాశం ఉంది. కోర్టు కేసులో మీకు ప్రయోజనం ఉంటుంది.
శుభ సంఖ్య: 2
రంగు: తెలుపు
పరిహారం: బియ్యం దానం చేయండి
సింహ రాశి
ఈ రోజు మీరు కొన్ని విషయాల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబం, పని రంగంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. మీ సన్నిహితులతో వివాదం ఉండొచ్చు. పాత ఆస్తి వివాదాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 1
రంగు: బంగారు
పరిహారం: సూర్య భగవానుడికి నీరు సమర్పించండి.
కన్యా రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కొత్త పని కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే మంచి సమయం ప్రారంభించండి. చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద భాగస్వామ్యం ఈ రోజు జరగవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది. శుభ కార్యాలు ప్లాన్ చేసుకోవచ్చు.
శుభ సంఖ్య: 6
రంగు: నీలం
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.
తులా రాశి
ఈ రోజు మీరు ఆస్తి సంబంధిత వివాదంలో చిక్కుకుంటారు. చిన్న నిర్లక్ష్యం కూడా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. శారీరక అలసట ఉంటుంది. భార్య .. పిల్లలతో కలిసి బయటకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక ఉండవచ్చు.
శుభ సంఖ్య: 8
రంగు: గులాబీ
పరిహారం: దుర్గా మాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు కొన్ని విషయాలను విస్మరించండి, లేకపోతే కుటుంబ సంబంధాలలో విభేదాలు పెరగవచ్చు. మీరు పాత వివాదంలో మళ్ళీ చిక్కుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, కానీ భాగస్వామ్యంలో జాగ్రత్త వహించండి.
శుభ సంఖ్య: 4
రంగు: నలుపు
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందులు ప్లాన్ చేసుకుంటారు. భార్య , పిల్లల ఆరోగ్యం సీజనల్ వ్యాధుల బారిన పడొచ్చు. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం పొందే అవకాశాలు ఉన్నాయి. పెద్ద డీల్ లేదా లావాదేవీల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
శుభ సంఖ్య: 3
రంగు: పసుపు
పరిహారం: విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి.
మకర రాశి
ఈ రోజు కుటుంబంలో వివాద సూచనలుంటాయి. మీ మనసు కలతచెందుతుంది. కుటుంబం కోసం పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త భవనం లేదా వాహనం కొనాలని ఆలోచించవచ్చు.
శుభ సంఖ్య: 10
రంగు: గోధుమ రంగు
పరిహారం: శివలింగానికి పాలతో అభిషేకం చేయండి
కుంభ రాశి
ఈ రోజు వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు, దీనివల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. భార్య ..పిల్లలతో కలిసి మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచించవచ్చు.
శుభ సంఖ్య: 11
రంగు: నీలం
పరిహారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి
మీన రాశి
పని ఎక్కువ కారణంగా బాగా అలసిపోతారు..ఆ ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది. కుటుంబంలో వివాదాలు జరిగే సూచనలున్నాయి. వ్యాపారంలో, మీరు పెద్ద డీల్ కోల్పోవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి ..వివాదాలను నివారించండి.
శుభ సంఖ్య: 12
రంగు: ఊదా
పరిహారం: విష్ణు సహస్రనామం పఠించండి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.




















