అన్వేషించండి

Astrology July 2025: జూలైలో గ్రహాల రాశి మార్పులు .. మీ రాశికి అనుకూలమా? ప్రతికూలమా? ఫలితాలు తెలుసుకోండి!

Month of July 2025 : శని, శుక్రుడు, బృహస్పతి, మంగళుడి ప్రభావం మీ రాశిపై ఎలా ఉండబోతోంది? ఆదాయం, ఆనందం, ఆరోగ్యంపై ఈ నెలలో ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి..

జూలై 2025 లో చాలా మార్పులుంటాయి. వక్రంలో శని సంచారం, శుక్రుడు తన రాశిలో ప్రవేశిస్తన్నాడు, బృహస్పతి దృష్టి, కుజుడు-కేతువుల కలయిక మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

మేష రాశి (Aries)

ప్రధాన గ్రహాలు: శుక్రుడు, రాహువు, గురువు
ప్రభావం: ఆర్థిక సమతుల్యత , వృత్తిపరమైన అవకాశాలు

ఈ నెలలో ఆదాయం ,  ఖర్చులు సమానంగా ఉంటాయి..పొదుపు చేసేందుకు ప్లాన్ చేయాలి.  రాహు-కేతువుల కారణంగా బంధాల్లో చికాకులుంటాయి సహనంగా వ్యవహరించాలి. కన్సల్టెన్సీ, విద్యకు సంబంధించి చేసిన ప్రయాణాల్లో లాభం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ నెల రోజులు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు కలిసొచ్చే రంగు ఎరుపు, లక్కీ నంబర్ 9.

వృషభ రాశి (Taurus)

ప్రధాన గ్రహాలు: శుక్రుడు, శని, సూర్యుడు
ప్రభావం: ఓర్పు - సంబంధాల సమతుల్యత

కెరీర్‌లో కొంచెం చికాకులుంటాయి కానీ ఆలస్యం అయినా మంచి ఫలితం సాధిస్తారు. సంబంధాలల్లో స్థిరత్వం ఉంటుంది. జూలై 18 నుంచి శని వక్ర దిశలో ఉన్న సమయంలో ఆత్మపరిశీలన పెరుగుతుంది. సానుకూల శక్తి ఉంటుంది. ఆర్థికంగా కొంత తగ్గుదల ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో కలిసొస్తుంది. ఆవుకి ఆకుకూరలు తినిపించండి. లక్కీ రంగు: పింక్ / లక్కీ సంఖ్య: 6

మిథున రాశి (Gemini)

ప్రధాన గ్రహాలు: సూర్యుడు, బుధుడు, రాహువు
ప్రభావం : కమ్యూనికేషన్, ఖర్చులు,  భావోద్వేగాలు

ఈ నెలలో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్స్ పై సంతకం చేసేముందు జాగ్రత్త వహించండి. ఎవరితోనూ విభేదాలు వద్దు, వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాయామం చేసేవారు జాగ్రత్త వహించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు.  బుధవారం నాడు ఆకుపచ్చ దుస్తులు ధరించండి. లక్కీ రంగు: ఆకుపచ్చ / లక్కీ సంఖ్య: 5

కర్కాటక రాశి (Cancer)

ప్రధాన గ్రహాలు: గురువు, సూర్యుడు, బుధుడు
ప్రభావం: వ్యయం, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం

ఖర్చులు, ప్రయాణాలు ఎక్కువవుతాయి కానీ ఆదాయం పెరుగుతుంది. సమస్యల నుంచి బయటపడేందుకు మౌనం అవసరం. చిన్న ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులు వాస్తవిక ప్రణాళికలు వేసుకోవాలి. శివుడికి పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించండి. లక్కీ రంగు: తెలుపు / లక్కీ సంఖ్య: 2

సింహ రాశి (Leo)

ప్రధాన గ్రహాలు: గురువు, శుక్రుడు, కుజుడు
ప్రభావం: కెరీర్ వృద్ధి , సంబంధాల సమతుల్యత

జూలై నెలలో సింహ రాశివారికి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. నెట్‌వర్క్ ద్వారా ప్రయోజనం పొందుతారు. కుజుడు-కేతువుల కారణంగా భాగస్వామ్య వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది...ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించండి. పొదులు పాటించండి. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. లక్కీ రంగు: బంగారు / లక్కీ సంఖ్య: 1

కన్యా రాశి (Virgo)

ప్రధాన గ్రహాలు: గురువు, శని
ప్రభావం: తెలివైన పని మరియు భవిష్యత్తు ప్రణాళిక

కెరీర్‌ కి సంబంధింతి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  సామాజిక నెట్‌వర్క్ ను ఉపయోగించుకుంటారు. స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోవద్దు. చట్టపమైన విషయాల్లో ఉపశమనం ఉంటుందియ. బంధాల మధ్య ప్రశాంతతను కాపాడుకోండి. శనివారం నీలం రంగు దుస్తులు ధరించండి
లక్కీ రంగు: బూడిద రంగు / లక్కీ సంఖ్య: 8

తులా రాశి (Libra)

ప్రధాన గ్రహాలు: శని, శుక్రుడు
ప్రభావం : స్థాన మార్పు, ఆర్థిక అభివృద్ధి

ఉద్యోగ బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు సాధ్యమవుతుంది. అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. పాత బాండ్లు/పాలసీల నుంచి లాభం పొందుతారు. వైవాహిక జీవితంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. శుక్రవారం రోజు దుర్గా సప్తశతిని పారాయణం చేయండి. లక్కీ రంగు: క్రీమ్ / లక్కీ సంఖ్య: 7

వృశ్చిక రాశి (Scorpio)
 
ప్రధాన గ్రహాలు: సూర్యుడు, కేతువు, గురువు
ప్రభావం: విద్య, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం

ఉన్నత విద్య లేదా తత్వశాస్త్రంపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు సాధ్యమవుతుంది. కోపాన్ని నియంత్రించండి. సంబంధం బలపడాలంటే నిజమైన సంభాషణ అవసరం. మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. లక్కీ రంగు: మెరూన్ / లక్కీ సంఖ్య: 9

ధనుస్సు రాశి (Sagittarius)

ప్రధాన గ్రహాలు: గురువు, సూర్యుడు
ప్రభావం:ప్రణాళిక, ఆధ్యాత్మికత ,ఆత్మపరిశీలన

జూలై నుంచి మీ బలహీనత పెరుగుతుంది. సంపాదనతో పాటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సంబంధాల్లో భావోద్వేగాలను వ్యక్తపరచడం అవసరం. 
విద్యార్థులకు కొంచెం కష్టమైన సమయం. బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్య నమస్కారాలు చేయండి. లక్కీ రంగు: ఊదా / లక్కీ సంఖ్య: 3

మకర రాశి (Capricorn)

ప్రధాన గ్రహాలు: శని, సూర్యుడు
ప్రభావం: కొత్త వ్యాపారం, ఆరోగ్యం , ఆర్థికం

జూలై నెలలో ఆరోగ్యం , ఖర్చులు రెండూ ఆందోళన కలిగించే విషయాలు. వ్యక్తిగత జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. శనివారం ఆలయంలో నూనె వేయండి. లక్కీ రంగు: నలుపు / లక్కీ సంఖ్య: 4

కుంభ రాశి (Aquarius)

ప్రధాన గ్రహాలు: గురువు, శుక్రుడు, కుజుడు
ప్రభావం: ఆర్థిక ప్రణాళిక మరియు ఇంటి సమతుల్యత

పాత అప్పులు క్లియర్ చేసేందుకు సమయం పడుతుంది. వ్యక్తిగత సంబంధాల్లో నూతన నిర్ణయాలు తీసోకోవద్దు. వాహనం లేదా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంటిని శుద్ధి చేయండి. లక్కీ రంగు: నీలం / లక్కీ సంఖ్య: 11

మీన రాశి (Pisces)

ప్రధాన గ్రహాలు: గురువు, బుధుడు
ప్రభావం: వ్యాపార విస్తరణ , ఆరోగ్యం

వ్యాపారంలో సహకారం లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించే ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  వైద్య  అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయండి. లక్కీ రంగు: పసుపు / లక్కీ సంఖ్య: 12

జూలై 2025లో ఏ గ్రహాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి?
శని (వక్ర గతి), గురువు, శుక్రుడు (స్వగృహి),  కుజుడు-కేతువుల కలయిక ఈ నెలలో ప్రధానమైనవి

2. ఈ నెలలో కెరీర్‌లో మార్పులు వస్తాయా?
సమాధానం 2. అవును, సింహ, కన్య, మీన మరియు వృషభ రాశి వారికి కెరీర్ మార్పు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది

3. ప్రేమ జీవితానికి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
తులా, సింహం, కుంభ రాశి వారికి సంబంధాల్లో ఒత్తిడి  పెరుగుతుంది

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ నమ్మకాలపై  ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించడం లేదు. వీటిని పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget