అన్వేషించండి

Horoscope Today 17 December 2024: ఈ రాశులవారు తప్పులు సరిదిద్దుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 17th  December 2024

మేష రాశి

మేషరాశి వారి కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అధికారి వర్గం మీపై చాలా ఆధారపడి ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త ఆస్తి లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు  ఎదుర్కోవచ్చు. విద్యార్థులు చదువు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. ఈ రోజు మీ మనస్సు కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా పరధ్యానంగా ఉండవచ్చు. 

మిథున రాశి

మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.  ప్రేమ సంబంధాలకు తగినంత సమయం దొరుకుతుంది.  కొత్త ఇల్లు కొనే ఆలోచన చేయవచ్చు. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి గుడ్ న్యూస్ తో మొదలై అలానే ఎండ్ అవుతుంది - డిసెంబరు 16 - 22 వారఫలాలు!
 
కర్కాటక రాశి

మీ నిర్ణయాలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇంటి పనిపై శ్రద్ధ ఉండదు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. కార్యాలయంలో అవమానం ఎదుర్కోవాల్సి రావొచ్చు.  

సింహ రాశి

ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతన ఉద్యోగం సాధిస్తారు. ఈ రోజు పెండింగ్ లో ఉన్న విషయాలు క్రమంగా పరిష్కారమవుతాయి. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు. స్నేహితులను కలుసుకున్న తర్వాత మీరు సంతోషంగా ఉంటారు.

కన్యా రాశి 

కన్యారాశివారు భౌతిక బలహీనత గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు చాలా పనులు పూర్తిచేస్తారు. మిమ్మల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కమిషన్ సంబంధిత వ్యాపారంచేసేవారు ప్రయోజనం పొందుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Also Read: కెరీర్లో అడ్డంకులు, ప్రియమైనవారితో వివాదాలు..ఈ వారం ఈ రాశులవారికి గందరగోళం - డిసెంబరు 16 - 22 వారఫలాలు!

తులా రాశి

ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో చాలా శ్రద్ధ వహించాలి. మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచండి. మీ అలవాట్లను అంతా విమర్శించవచ్చు. గత పరిచయాల నుంచి ప్రయోజనాలను పొందుతారు.  మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది.

వృశ్చిక రాశి

కార్యాలయంలో మీ బాధ్యత నిర్వహించేందుకు నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు అకస్మాత్తుగా కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ప్రేమ సంబంధాలలో మోసపోయే అవకాశం ఉంది.  రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు మందుల వాడకంలో అజాగ్రత్తగా ఉండకూడదు. 

ధనుస్సు రాశి 

ఈ రాశి ఉద్యోగులకు పని ప్రదేశాల్లో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది.  చిల్లర వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీరు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ఎవరికీ సలహాలు ఇవ్వకండి.

Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
 
మకర రాశి 

మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకుని అనుసరించండి.  మీరు బంధువుకు సహాయం చేయవలసి రావచ్చు. ఇది మీ మనసుకు ఎంతో సంతోషాన్నిస్తుంది. స్నేహితుల సహాయంతో మీ పనులు పూర్తవుతాయి.  

కుంభ రాశి

ఇతరుల విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించవద్దు. ఇంటి పెద్దల ఆశీశ్సులు పొందుతారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు మంచిది. చేపట్టిన పనిలో ఎదురయ్యే అడ్డంకుల వల్ల మానసికంగా బాధపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మేయవద్దు.  

మీన రాశి

ఈ రాశివారికి కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.  అదనపు పనిభారం వల్ల ఈ రోజు ఆందోళన చెందుతారు. మీ ఖర్చులను పరిమితంగా,  సమతుల్యంగా ఉంచండి.

Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget