Weekly Horoscope : ఈ వారం ఈ రాశులవారికి గుడ్ న్యూస్ తో మొదలై అలానే ఎండ్ అవుతుంది - డిసెంబరు 16 - 22 వారఫలాలు!
Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ వారం రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Weekly Horoscope From December 16 - 22 In Telugu: డిసెంబరు 16 సోమవారం to డిసెంబరు 22 ఆదివారం
మేషరాశి వారఫలం (Aries Weekly Horoscope)
కొత్త వారం మేషరాశి వారికి గొప్పగా ఉంటుంది. మీ కెరీర్, వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. కెరీర్ పరంగా ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. చేసిన అప్పులు తీర్చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ వారం బాగా ఇష్టపడే స్నేహితుడు లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారం మొదటి భాగంలో శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
సింహరాశి వారఫలం (Leo Weekly Horoscope)
ప్రియమైన వ్యక్తికి సంబంధించిన ఓ శుభవార్తలతో ఈ వారం మీకు ప్రారంభమవుతుంది..ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వారం మీరు విలాసాలకు సంబంధించిన విషయాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఈ వారం మీరు చెపట్టే పనులకు అడ్డంకులు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీడియా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు, PR, మార్కెటింగ్ పని చేసే వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది.
తులారాశి వారఫలం (Libra Weekly Horoscope)
ఈ వారం ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ రాశి ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు ఉంటాయి. కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. పదవి, ప్రతిష్టలు పెరుగుతాయి. జర్నలిస్టులు, స్క్రిప్ట్ రైటర్‌లు లేదా పరిశోధకుల వంటి రచనా పనితో అనుబంధించబడిన వ్యక్తులకు కూడా ఈ వారం శుభప్రదం. నూతన అవకాశాలు పలకరిస్తాయి. ఉన్నత విద్య లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందవచ్చు. గృహ జీవితంలో ఎక్కువ సమయం మతపరమైన కార్యక్రమాలలో గడుపుతారు. వారం ద్వితీయార్థంలో ఇంట్లో మతపరమైన, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తోబుట్టువులు , తల్లిదండ్రులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో ఆత్మీయుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
కుంభరాశి వారఫలం (Aquarius Weekly Horoscope)
ఈ వారం కుంభ రాశివారికి శుభప్రదమైన రోజు. చాలాకాలంగా అసంపూర్తిగా ఉండిపోయిన పనులు శ్రేయోభిలాషి లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో ఈ వారం పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పదవి, ప్రతిష్ట, గౌరవం పొందడం ద్వారా మీ ఉత్సాహం ధైర్యం పెరుగుతుంది. వారం చివర్లో విలాసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ కాలంలో భూమి, భవనం లేదా వాహనంలో ఆనందం పొందడం సాధ్యమవుతుంది. ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసులేమైనా నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. సన్నిహిత సంబంధాలలో ప్రేమ , నమ్మకం పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభించినప్పుడు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
మీనరాశి వారఫలం (Pisces Weekly Horoscope)
ఈ వారం మీకు మంచి ఫలితాలున్నాయి. వారం ప్రారంభం నుంచి మీరు ఆశించిన పనిలో విజయం సాధిస్తారు. కెరీర్-వాణిజ్యం-వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పెద్ద అవకాశాలను పొందుతారు. మీరు శ్రేయోభిలాషులు, సీనియర్ అధికారులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలు ఆర్జిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది





















