అన్వేషించండి

Makar Sankranti Horoscope Today January 15th 2024 :మకర సంక్రాంతి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతోంది, జనవరి 15 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 15th January  2024  - జనవరి 15 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన నిర్వహణకు ధనం వెచ్చించవచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో పెద్ద మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వాహన ఆనందాన్ని పొందుతారు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. కోపం, ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రోజు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంతి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వాహన నిర్వహణకు ధనాన్ని వెచ్చించవచ్చు.

Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీరు  వ్యాపారంలో విజయం సాధిస్తారు.  కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మీ సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవాలి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది.  ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీరు  ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి.  కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి మీకు సమయం లభిస్తుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది కానీ తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు ఉండవచ్చు. భావోద్వేగాలకు దూరంగా ఉండండి.  రోజు మీరు మీ సోదరుడు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం చేయాల్సి రావొచ్చు. దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. ఆస్తి నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మనస్సు ఆనందంగా ఉంటుంది.

Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!

సింహ రాశి (Leo Horoscope Today)

 కెరీర్‌లో పురోగతి పొందుతారు. కష్టపడి పని చేయాలి మరియు కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసం మీరు కష్టపడి పనిచేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ రోజు తక్కువ ఆదాయం  ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.   క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. మాటలో మాధుర్యం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు కానీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. పాత మిత్రులను కలుస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.  సంపద పెరుగుతుంది.   కుటుంబ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. ..మాటలో కర్కశత్వం రానివ్వవద్దు. హఠాత్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  కార్యాలయంలో మార్పు ఉండవచ్చు.  

Also Read: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి, కానీ ప్రణాళికేతర ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మనసు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 
 
ఈ రోజు మీరు మీ పనికి సమయం, శ్రద్ధ ఇవ్వాలి. ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాలలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఇది ఉత్తమ సమయం....కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమే కానీ తొందరపడి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి.  దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించండి. ఆరోగ్యానికి సంబంధించి కొత్త మార్పులు చేసుకోవడానికి ఇదే రైట్ టైమ్. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

వృత్తి, ఉద్యోగాలపై దృష్టి సారించాలి. కష్టపడి పని చేయాలి. కుటుంబ బంధాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపేందుకు ప్రయత్నించండి. వారి భావాలకు విలువనివ్వండి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఈరోజు ఇంటర్వ్యూకు కాల్ రావచ్చు.  అంటువ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి.  ఆహారంపై శ్రద్ధ వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. డబ్బుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. కుటుంబ సభ్యులతో  సమయం గడపవలసి ఉంటుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కొంతమంది ఈరోజు ఉద్యోగాలు మారవచ్చు, మరికొంతమంది పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. నూనె ,  మసాలా వస్తువులకు దూరంగా ఉండడం మంచిది. 

మీన రాశి (Pisces Horoscope Today) 

 సృజనాత్మక రంగంలో మీ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. మీ లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. పని బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. జీవితంలో పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ మనసుని ఓ విషయం బాధపెడుతుంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది.

Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

 ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు ఏబీపీ దేశం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు

టాప్ హెడ్ లైన్స్

18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget