By: RAMA | Updated at : 18 Feb 2023 07:48 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Maha Shivratri 2023 Lingashtakam: ఫిబ్రవరి 18 శనివారం మహా శివరాత్రి. ఈ సందర్భంగా శివారాధన చేసేవారు, జాగరణ, ఉపవాసం ఉండేవారంతా లింగాష్టకం చదువుకుంటే ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు పండితులు. నిరాకారుడిగా కొలువైన శివయ్యను ఆరాధన వెనుకున్న ఆంతర్యం, లింగాష్టకం అర్థం ఇక్కడ చూడండి.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం (బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం)
నిర్మల భాషిత శోభిత లింగం ( నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం)
జన్మజ దుఃఖ వినాశక లింగం ( జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)
దేవముని ప్రవరార్చిత లింగం (దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం)
కామదహన కరుణాకర లింగం ( మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం)
రావణ దర్ప వినాశక లింగం ( రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం)
తత్ ప్రణమామి సద శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)
సర్వ సుగంధ సులేపిత లింగం ( మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం)
బుద్ధి వివర్ధన కారణ లింగం (మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం )
సిద్ధ సురాసుర వందిత లింగం (సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)
కనక మహామణి భూషిత లింగం (బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం)
ఫణిపతి వేష్టిత శోభిత లింగం ( నాగుపాముని అలంకారంగా చేసుకున్న శివలింగం)
దక్ష సుయజ్ఞ వినాశక లింగం (దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)
కుంకుమ చందన లేపిత లింగం (కుంకుమ , గంధం పూసిన శివ లింగం)
పంకజ హార సుశోభిత లింగం (కలువ దండలతో అలంకరించిన లింగం)
సంచిత పాప వినాశక లింగం (సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)
దేవగణార్చిత సేవిత లింగం (దేవ గణాలతో పూజలందుకున్న శివలింగం)
భావైర్ భక్తీ భిరేవచ లింగం (చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగం)
దినకర కోటి ప్రభాకర లింగం (కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)
అష్ట దలోపరి వేష్టిత లింగం (ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం)
సర్వ సముద్భవ కారణ లింగం (అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం)
అష్ట దరిద్ర వినాశక లింగం (ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)
సురగురు సురవర పూజిత లింగం (దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగం)
సురవన పుష్ప సదార్చిత లింగం (నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగం)
పరమపదం పరమాత్మక లింగం (ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)
లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
(ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)
Also Read: ఆటగదరా శివా - జీవిత చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరించే శివుడి పాటలు మీకోసం
Also Read: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!
Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!
Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!