మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలు మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు... రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి..పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేదుకే ఉపవాసం, జాగరణ చేస్తారు. Images Credit: Pinterest