ABP Desam


శివుని పంచ ముఖాలు ఇవే!


ABP Desam


దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు మాత్రం ఎప్పుడూ అలా కనిపించడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు.


ABP Desam


ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం


ABP Desam


తత్పురుషం
తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే అంటారు.


ABP Desam


అఘోరం
దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు చూస్తూ కనిపిస్తాడు శివుడు.


ABP Desam


సద్యోజాతం
శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు.


ABP Desam


వామదేవం
పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని చాటిచెప్పే రూపమే వామదేవం. శివుడు కుటుంబంతో సహా కనిపించే రూపంలో సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది.


ABP Desam


మరో ముఖంగా చెప్పే ఈశానంలో పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.


ABP Desam


పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన రోజే శివరాత్రి. ఈ ఏడాది ఫిబ్రవరి 18 శనివారం శివరాత్రి.
Image‌s Credit: Pixabay