అన్వేషించండి

Maha Shivaratri Horoscope 8th March 2024: ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం పుష్కలం, మార్చి 08 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Today Horoscope 8th March 2024

మేష రాశి
మీ ఆలోచనలు సరైన మార్గంలో ఉన్నాయి వాటిని అమలు చేయడానికి ఇదే మంచి సమయం. అయితే పెద్దల సలహాలు స్వీకరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ బంధాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్నేహితులతో కమ్యూనికేషన్ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. 

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు పనిలో ఏకాగ్రత వహించాలి. ఉన్నతాధికారులను మెప్పించాలంటే కష్టపడాల్సిందే. స్నేహితుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

మిథున రాశి

రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు మీ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తికి ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉండాలి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు పనిలో సీరియస్ గా ఉండాలి. 

Also Read: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!

కర్కాటక రాశి

ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యాన్ని వీడండి. భవిష్యత్ కోసం ఆలోచన చేసేందుకు ఇదే మంచి సమయం. సొంతింటి నిర్మాణం గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు.మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

సింహ రాశి

ఈ రాశివారికి కార్యాలయంలో, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఇబ్బంది పెడతాయి. మీడియా రంగంలో ఉండేవారికి శుభసమయం. పూర్వీకుల ఆస్తి తగాదాలు తీరిపోయి మీకు లాభం చేకూరుతుంది. ఉద్యోగం, కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను పాటించాలి. 

కన్యా రాశి

ఎప్పటి నుంచో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. మీరు చెప్పాలి అనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఇతరులపై మీ ఇష్టాన్ని రుద్దవద్దు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వ్యాపారులు భారీగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. 

తులా రాశి

ఈ రాశివారు నూతన ప్రాజెక్టుల గురించి సహోద్యోగులతో చర్చిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్చే సమయం. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి సమయం. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేయండి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి 

ఈ రాశివారు ప్రణాళికలను అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని విషయాల్లో రిస్క్ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మీ లక్ష్యాలను పక్కనపెట్టేయవద్దు...

Also Read: మహాశివరాత్రి జాగరణ అంటే మేల్కొని ఉండడం అనుకుంటున్నారా!

ధనుస్సు రాశి

ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబ జీవితం బావుంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులకు శుభసమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించిన తర్వాతే ముందడుగు వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. 

మకర రాశి

మీ కృషి ఫలిస్తుంది. పనిలో ఇతరుల కన్నా మీరు ప్రశంసలు అందుకుంటారు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారం మెరుగుపడుతుంది.  ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రేమికులకు శుభదినం.

కుంభ రాశి
 
భవిష్యత్ కోసం ఆలోచించాల్సిన సమయం ఇది. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. శివారాధన చేయండి ప్రశాంతత లభిస్తుంది. 

Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!

మీన రాశి

ఈ రాశివారు వృత్తి పరమైన లక్ష్యాలపై దృష్టి సారించాలి. ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది..అదనపు ఖర్చులు అదుపు చేయడం మంచిది. చిన్న చిన్న సమస్యలు మినహా ఆరోగ్యం బావుంటుంది. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు..

Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget