శివరాత్రికి ఏ జాములో ఏం చేయాలి! శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్టే...పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసిదళాలతో పూజ చేయాలి మూడో జాములో నేయితో అభిషేకించి మారేడు దళాలతో పూజ చేయాలి నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం అభిషేకం చేసుకున్నా మంచిదే శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, లింగాష్టకం, బిళ్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించాలి Images Credit: Pixabay