శివుడు సృష్టించిన వృక్షం ఇది - అందుకే పూజకు చాలా ప్రత్యేకం!

బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రం దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశిస్తే సర్వపాపములు నశిస్తాయి.

భక్తిశ్రధ్ధలతో బిల్వ దళాన్ని అర్పిస్తే ఘోరాతిఘోరమైన పాపాలు తొలగిపోతాయి

శివానుగ్రహం కోసం లక్ష్మీదేవి సప్తర్షులతో ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది.

యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి వచ్చి 'ఆకలి! ఆకలి!' అని కేకలు వేసింది

అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి...శక్తికి సమర్పించాలి అనుకుంది.

అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు లక్ష్మీదేవి నివేదిత స్థలం అయిన హోమగుండం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు..అదే బిల్వవృక్షం.

ఈ దళాలతో తనను పూజిస్తే అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని చెప్పాడు శివుడు.

అలా పరమేశ్వరుడి సేవకోసమే బిల్వవృక్షం భూలోకంలో పుట్టిందని చెబుతారు. Image Credit: Pinterest