News
News
X

ఫిబ్రవరి 23 ప్రేమ రాశిఫలాలు: ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఆనందం, ఆ రాశివారికి ప్రేమలో బ్రేకప్

Love Rasi Phalalu Today 23 February 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

మేష రాశి 

ఈ రాశివారు చికాకుతో ఏదో మాట్లాడుతుంటారు. ఇలాంటి మూడ్ లో ఉన్నప్పుడు మాట్లాడేముందు ఆలోచించండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, ప్రేమించినవాతో అయినా మాట్లాడేటప్పుడు చిరాకు ప్రదర్శించవద్దు. బంధం బలహీనమవుతుంది. 

వృషభ రాశి

ఈ రాశి ప్రేమికులు, వివాహితులు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కుటుంబంలో వివాహం ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది...సమాధానం సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. 

మిథున రాశి

మీరు ఇష్టపడే వారిని కలవడానికి ప్లాన్ చేసుకోండి. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.నాలుగు గోడల మధ్య పరిమితం కాకుండా బయటకు అడుగుపెట్టడం ద్వారా మీకు ప్రశాంతత పెరుగుతుంది. 

Also Read: మీరు ఏ రంగంలో పని చేయాలో మీ రాశి, నక్షత్రం చెప్పేస్తుంది

కర్కాటక రాశి

ప్రేమ సంబంధాలకు సంబంధించి ఈ రోజు యువతకు అనుకూలంగా ఉంది. ప్రేమికులు కూడా తమ ప్రేమ విషయంలో సీరియస్ గా ఉండాలి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఆ దిశగా అడుగేయడం మంచిది

సింహ రాశి

ఈ రోజు మీ భాగస్వామితో ఇంట్లో గడపడానికి బదులు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల బంధం మరింత బలపడుతుంది. వివాహితులు జీవిత భాగస్వామికి, అవివాహితులు ప్రేమించినవారికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. 

కన్యా రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆలోచనలు రొమాంటిక్ గా ఉంటాయి. మీరు ప్రేమలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబంతో సమయం గడుపుతారు.

తులా రాశి 

మీకు మీ భాగస్వామికి మధ్య గొడవలు జరుగుతుంటే ఈ రోజు పరిష్కారం దిశగా అడుగేయడం మంచిది. వారితో కూర్చుని మాట్లాడటం ద్వారా చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముందు మీరు ప్రశాంతంగా ఆలోచించండి

Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

వృశ్చిక రాశి 

ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తితో మంచి బంధాన్ని కలిగి ఉండలేరు. ఈ రోజు ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం బావుంటంది. ఇద్దరి మధ్యా సయోధ్య పెరుగుతుంది. ఉద్యోగంలో ఎక్కడో ఒక చోట సమస్యలు వస్తాయి.

ధనుస్సు రాశి 

మీ భాగస్వామి మీకు ఏదైనా చెబితే చెడుగా తీసుకోకండి, ఎందుకంటే వారు ఆ విషయంలో ఉన్న అనుభవంతో చెబుతున్నారని అర్థం చేసుకోండి. అనవసర వాదనకు దిగొద్దు. మీ బంధాన్ని బలహీనపరిచే విషయాలను అస్సలు పొడిగించవద్దు.

మకర రాశి

ఈ రాశి ప్రేమికులకు మంచిరోజు. మీ భాగస్వామితో గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుచేసుకుంటారు. వివాహేతర సంబంధం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. భాగస్వామి కొన్ని అసాధ్యమైన డిమాండ్లు చేయవచ్చు. కుటుంబం నుంచి మీకు అండ ఉంటుంది. 

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశివారు కార్యాలయంలో ఏదో సమస్యతో ఇబ్బంది పడతారు కానీ కుటుంబం కారణంగా రిలీఫ్ పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. 

మీన రాశి 

అందరి దృష్టి మీ ప్రేమ సంబంధంపై పడుతుంది. మీరు నోరు తెరిచి మాట్లాడకుండానే అపార్థాలు ఏర్పడతాయి.  ప్రేమికుల మధ్య బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి ప్రయోజనం పొందుతారు. త్వరగా భావోద్వేగానికి లోనవుతారు భార్యాభర్తల మధ్య పాత కలహాలు సమసిపోతాయి.

Published at : 23 Feb 2023 06:02 AM (IST) Tags: Astrology Daily Love Horoscope Todays Love Horoscope Love and Relationship Horoscope Love and Relationship Horoscope 23 February

సంబంధిత కథనాలు

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు

మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్