Horoscope Today 21 November 2024: ఈ రాశులవారు మానసికంగా బలహీనంగా ఉంటారు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today November 21, 2024
మేష రాశి
ఈ రోజు మీరు ప్రయాణం వల్ల అలసిపోయినట్లు అనిపించవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. ఎవరి మాటలను వెంటనే నమ్మవద్దు. ఏదైనా ఒప్పందానికి ముందు సమగ్ర విచారణ చేయండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
వృషభ రాశి
ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ సామర్థ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. పెద్దలకు గౌరవం ఇవ్వండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రభుత్వ పనులు పూర్తి కాగలవు.
మిథున రాశి
ఈ రోజు మీకు కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో తెలివిగా వ్యవహరించండి. నూతన వ్యాపారం ప్రారంభించేవారు ధైర్యంగా అడుగుపెట్టండి కానీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులను ఎక్కువగా నమ్మొద్దు.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతృప్తి ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి విజయం సాధిస్తారు. సోమరితనం తగ్గుతుంది. షేర్లరో పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.
సింహ రాశి
కళారంగంలో ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి. చెడ్డవారి సాంగత్యం వల్ల ధన నష్టం రావచ్చు. రహస్య శత్రువులు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఆడంబరం వల్ల ఈరోజు ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యులతో ముఖ్యమైన పనులపై చర్చిస్తారు. నూతన పనులు ప్రారంభించేందుకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది.
తులా రాశి
ఈ రోజు అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. మీ సమర్థత పెరుగుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనిని తిరిగి ప్రారంభించవచ్చు. ఈరోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ నిర్వహణ సామర్థ్యం ప్రశంసలు అందుకుంటుంది. కుటుంబంలోని పెద్దలకు బహుమతులు ఇస్తారు. ఖర్చు చేసేముందు ఆలోచించండి.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు మంచి ఆఫర్ పొందుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఈ రోజు మీరు మీ పనితో విసుగు చెందుతారు. మానసికంగా బలహీనంగా ఉంటారు. వ్యాపారం రెండింతలు పెరుగుతుంది.
ధనస్సు రాశి
ఈ రోజు వ్యాపార సంబంధిత సమస్యలు రావొచ్చు. రక్తపోటు రోగులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. పనికిరాని విషయాల గురించి ఆలోచించవద్దు.
మకర రాశి
ఈరోజు మీరు కార్యాలయంలో రివార్డులు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది
కుంభ రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగిన లాభం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలను పొందవచ్చు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.
మీన రాశి
ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. వ్యాపారంలో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఎగుమతి-దిగుమతుల ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. యూత్ కి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. జీతాల పెంపుపై అధికారులతో చర్చలు జరిగే అవకాశం ఉంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!