Horoscope Today: ఈ రాశులవారు పెద్ద సమస్య నుంచి బయటపడతారు.. వీళ్లు మాత్రం ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది
గమనిక:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
2021 ఆగస్టు 20 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఆర్థిక వృద్ధికి కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తుంది. గౌరవం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకండి. ప్రభుత్వ పనిలో అనుకూలత ఉంటుంది. ఈరోజు బాగా కలిసొస్తుంది.
వృషభం
ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. వ్యాపార ప్రయాణం విజయవంతమవుతుంది. కుటుంబంలో సమస్యలు అలాగే ఉంటాయి. బాగా అలసిపోతారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
మిథునం
వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అతిథులు ఇంటికి వస్తారు. వ్యయం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. సంతోషం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. అనారోగ్యం కారణంగా కొంత నష్టం ఉంటుంది. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెద్ద సమస్య నుంచి బయటపడతారు. పనిలో అనుకూలత ఉంటుంది.
కర్కాటకం
దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడతారు. వాహనాలు, యంత్రాల వాడకంలో అజాగ్రత్తగా ఉండకండి. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల గాయపడతారు. కోపాన్ని నియంత్రించుకోండి. ఆదాయంలో అనిశ్చితి ఉంటుంది. ఓపికగా ఉండండి. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పని పట్ల ఉత్సాహం ఉంటుంది. ఏ పనిలోనూ తొందరపడకండి. స్థిరాస్తి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
సింహం
పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. శుభవార్త వింటారు. సమయానికి పని చేయలేకపోవడం వల్ల టెన్షన్ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఇంతకు ముందు చేసిన ప్రయత్నాల ప్రయోజనాన్ని ఇప్పుడు పొందుతారు. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. పోటీదారులపై విజయం ఉంటుంది. కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కోల్పోయిన వస్తువులు కనిపించే అవకాశం ఉంది.
కన్య
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైన వివాదాలు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలొస్తాయి. కార్యాలయంలో సంతోషంగా పనిచేస్తారు. ప్రయాణాల్లో ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వ పనిలో అనుకూలత ఉంటుంది. పరిస్థితి అదుపులోనే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి.
తులారాశి
కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహా పాటించడం వల్ల మీకు కలిసొస్తుంది. పెట్టుబడి ఆఫర్లను పొందవచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వెన్నునొప్పి సమస్య కావచ్చు.
వృశ్చికరాశి
బంధువులతో మంచి సమయం గడుపుతారు. పెద్దల సలహాతో మాత్రమే కొత్త పనులు చేయండి. ఈరోజు బాగానే ఉంటుంది. స్నేహితులతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. మీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి రోజుది.
ధనుస్సు
మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం
కొత్త బాధ్యతను పొందడంతో పాత పనిపై ప్రభావం పడుతుంది. ఇది మానసిక అస్థిరతకు కారణమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు రోజు బాగుంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. వ్యాపారస్తులకు కలిసొచ్చే రోజు. దంపతుల మధ్య బంధం బలంగా ఉంటుంది. కార్యాలయ వాతావరణం మీకు సంతోషాన్నిస్తుంది. కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. తలపెట్టిన పని ఆలస్యం అవుతుంది. కుటుంబ సభ్యులు మీతో ఉంటారు. మీ దినచర్యలో మార్పులు చేసుకోండి. ప్రేమికుల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
మీనం
చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించండి. కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
Also Read: ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!
Also Read: ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్‌మీట్ అందుకేనా?
Also Read: అభిమాని చర్యకు చలించిపోయిన ప్రకాశ్‌రాజ్.. త్వరలోనే కలుస్తానని హామీ
Also Read: సముద్రం మధ్యలో రామ్ చరణ్ బ్యూటీ అందాల విందు