అన్వేషించండి

Horoscope Today September 11, 2023: ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఇది గుడ్ టైమ్, సెప్టెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today  September 11, 2023: (సెప్టెంబరు 11 రాశిఫలాలు)

మేష రాశి

ఈ రోజు మేష రాశి వారు చాలా బిజీగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది.  విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెద్దల సలహాలు పాటించడం మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో అనవసర వాగ్వాదాలకు దిగకూడదు. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్లుగా ఉన్న అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తన వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు కానుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి ఒత్తిడి పెరుగుతుంది... భాగస్వాములపై నిఘా ఉంచండి. స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది. సత్కార్యాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ప్రవర్తనలో మార్పును మీరు గమనిస్తారు.

Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో సానుకూల మార్పులుంటాయి

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారు కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీపై ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అనుకున్న పనిలో జాప్యం ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ రోజంతా చాలా బిజీగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. 

సింహ రాశి

ఈ రాశివారికి ఈ రోజు శుభప్రదమైన , ఫలవంతమైన రోజు. భగవంతుడిని పూజించడం వల్ల బాధలు దూరమవుతాయి. వ్యాపారంలో కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఉద్యోగులు పనితీరు బావుంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో  జాప్యం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి.

కన్యా రాశి

మీరు మీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేస్తారు. లోతైన రహస్యాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి ఉంటుంది. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. ఆరోగ్యం క్షీణించవచ్చు.

తులా రాశి

ఈ రాశివారు స్నేహితుడితో టైమ్ స్పెండ్ చేస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకు టైమ్ కేటాయిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉంటారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చిక రాశి

కుటుంబ విషయాలకు సంబంధించి తీవ్రమైన చర్చలు ఉంటాయి. శారీరకంగా ఇబ్బంది పడతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా విస్తరించవచ్చు. ఇంటికి కొత్త అతిథి రావచ్చు. నూతన వధూవరులకు శుభసమయం.  డబ్బు ఖర్చు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. స్నేహితులపై కోపం ప్రదర్శిస్తారు.

Also Read: వయసుకి తగిన పాఠాలు చెప్పే విశ్వవిద్యాలయం కోణార్క్, ఆలయంలో ఇవి మీరు గమనించారా!

ధనుస్సు రాశి

ఈ రోజు  మీకు అద్భుతంగా ఉంటుంది. కొన్నిరోజులుగా వెంటాడుతున్న గందరగోళం నుంచి  ఉపశమనం పొందుతారు. పనికిరాని పనులకోసం సమయాన్ని వృథా చేయవద్దు. మీ జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం బాగానే సాగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. 

మకర రాశి

ఈ రాశివారు స్నేహితుడి నుంచి విడిపోయే అవకాశం ఉంది. తప్పుడు చర్యలపై శ్రద్ధ చూపవద్దు. మనసులో ఆలోచనలు మారుతాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితం పొందుతారు.  వ్యాపారంలో అజాగ్రత్తగా ఉండకండి. ఉద్యోగులు ఉన్నతాధికారులను కలుస్తారు.  కెరీర్ కి సంబంధించిన నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. 

కుంభ రాశి

ఈ రాశివారు వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు. జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దు. సాంకేతిక సాధనాలను జాగ్రత్తగా వినియోగించాలి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మీన రాశి

ఈ రాశివారు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యారారంలో లాభాలు ఆర్జిస్తారు. కారణం లేకుండా ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. ఈ రాశికిచెందిన రాజకీయ నాయకులకు ఇది శుభసమయం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Bengaluru: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Embed widget