Horoscope Today: ఈరోజు రాశిఫలాలు... ఈ రాశుల వారికి దశ తిరుగుతుంది..!
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 1 ఆదివారం రాశిఫలాలు
మేషం
మేషరాశివారికి ఈ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. వివాదాలు సమసిపోతాయి. ఏ బాధ్యతనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. అత్యాశ వద్దు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులకు దూరంగా ఉండాలని మీ మనస్సాక్షి హెచ్చరిస్తుంది. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. స్నేహతులతో సంతోషంగా ఉంటారు.
వృషభం
అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఇంటా-బయటా ప్రశంసలందుకుంటారు. వేరొకరి చేతిలో కీలుబొమ్మగా ఉండొద్దు. ఆలోచించి ఆడుగేయండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
మిథునం
ఖర్చు చేసేవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ మనస్సు అదుపులో ఉంచుకోండి. వ్యాపారం అంత అనుకూలంగా సాగదు. మీరు ఏపని పూర్తిచేయలేరు. ఇతరుల సలహాలు తీసుకోండి...మాటపై సంయమనం పాటించండి. ఆరోగ్యం బావుంటుంది. బంధువులతో కొన్ని చర్చలుంటాయి.
కర్కాటక రాశి
ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒకరి మాటలు విని స్నేహితులను అవమానించవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు...వాటివల్ల మీ భవిష్యత్ లోభాదపడతారు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు..మీలో సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
సింహం
సింహరాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బాధ్యత తీసుకోవడానికి వెనకాడరు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కన్య
కన్యరాశివారు మీ బాధ్యతలను సకాలంలో పూర్తిచేయలేరు. కొంత చికాకుగా వ్యవహరిస్తారు. పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల నుంచి సహాయం తీసుకోండి. పేదలకు సహాయం చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రమాదం తెచ్చిపెట్టే పనులు చేయొద్దు.
తులారాశి
తులారాశివారు ఈరోజు ఆచితూచి మాట్లాడండి. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. మీ సన్నిహితులను కలుస్తారు. ప్రయాణాల్లో ఆహ్లాదాన్ని పొందుతారు. కొత్తవ్యక్తులతో సమావేశమవుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. గా జరుగుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతుంది. (చదవండి: జాతకం ఆగస్టు 2021)
వృశ్చికరాశి
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ప్లాన్ చేసుకుని పనులు పూర్తిచేసుకోండి. నిలిచిన పనులు పూర్తయ్యే సూచనలున్నాయి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
ధనుస్సు
ధనస్సు రాశివారిని అదృష్టం వరిస్తుంది. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. మీ భాగస్వామితో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సమయం కలిసొస్తుంది. స్నేహితులను కలుస్తారు. ఇంట్లో ఉండే వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీకు శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి.
మకరం
మకర రాశివారు బంధువులను కలుస్తారు. వ్యాపారరంగంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఖర్చు ఎక్కువ చేయకుండా పొదుపుచేయడంపై దృష్టి సారించండి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అపరిచితుల నుంచి సహాయం తీసుకోకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. జీవిత భాగస్వామితో ప్రయాణానికి ప్రణాళికను రూపొందిస్తారు.
కుంభం
కుంభరాశి వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ మాటపై సంయమనం పాటించండి. దూషించే పదాలను ఉపయోగించవద్దు. స్థిరాస్తి కొనుగోలుకి సరైన సమయం. కుటుంబ సభ్యుల సమస్యలు అర్థం చేసుకుని పరిష్కారానికి ప్రయత్నించండి. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.
మీనం
మీనరాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మానసికంగా సమతుల్యంగా ఉండాలంటే...భగవంతుడిని పూజించాలి. కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సమస్యలుంటాయి. వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులనుంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనకూల సమయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.