ఈ రాశులవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. అక్టోబరు 28 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 28 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. మీ ఆదర్శవాదం వల్ల అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తిచేయగలుగుతారు.
వృషభ రాశి
ఈ రాశివారి మొండి స్వభావం గొడవలు రావచ్చు. అవసరానికి చేతిలో డబ్బు ఉండకపోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కార్యాలయ వాతావరణం ప్రతికూలంగా ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రాశివారు అనుకోని ప్రయాణం చేస్తారు. వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తారు. గతంలో మీరు పడిన కష్టానికి అర్థవంతమైన ఫలితం పొందుతారు. సంతోషంగా ఉంటారు. కుటంబ సభ్యుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. మీరు మంచి నడవడిక గల వ్యక్తిగా పరిగణించబడతారు.
Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!
కర్కాటక రాశి
ఈ రాశివారిలో చురుకుదనం పెరుగుతుంది. ఓ శుభవార్త మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే అవకాశం ఉంది. మీ మాటతీరు జీవిత భాగస్వామిని బాధపెట్టొచ్చు..ఆలోచనాత్మకంగా మాట్లాడండి.
సింహ రాశి
ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో విభేదాలు రావొచ్చు. కార్యాలయంలో, వ్యాపారంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు మరింత కష్టపడాలి. చట్టపరమైన విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు.
కన్యా రాశి
ఈ రాశివారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యానికి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..గాయపడే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది.
Also Read: అక్టోబరు 28 చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!
తులా రాశి
వ్యాపారంలో గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు ఏవైనా నెరవేరవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు తలుపుతడతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడొద్దు. మీరు ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. స్నేహితులతో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. ప్రేమ సంబంధాల విషయంలో అచితూచి వ్యవహరించాలి
ధనుస్సు రాశి
ఈ రాశి విద్యార్థులు తమ కెరీర్ విషయంలో గందరగోళానికి గురవుతారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరం పాటించండి. కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ నుంచి దూరం కావొచ్చు. తలపెట్టిన పనిలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!
మకర రాశి
ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ కెరీర్‌కు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండె రోగులు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. తగినంత విశ్రాంతి అవసరం. జీవిత భాగస్వామితో అనవసర వాదనకు దిగొద్దు.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితులు , బంధువులను కలుసుకోవచ్చు. పెండింగ్ చెల్లింపులు పొందే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో లాభం ఉంటుంది
Also Read: అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారి దినచర్య బావుంటుంది. అనవసర పనులు, ప్రయాణాలకు దూరంగా ఉండండ మంచిది. కార్యాలయంలో సహోద్యోగులు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కోపం తగ్గించుకోకుంటే ప్రారంభించిన పనిని సక్రమంగా పూర్తిచేయలేరు. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది.