అన్వేషించండి

Horoscope Today November 30th: ఈ రాశివారి మాట, మనసు రెండూ చంచలమే - నవంబరు 30 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. నవంబరు 29, 2023 బుధవారం మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today  30th November 2023 (నవంబరు 30 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు సహనంగా ఉండాలి. స్నేహితుల సహాయంలో ఉద్యోగం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఆ ప్రభావం తమ వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాలి, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. 

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

మనసులో ఒడిదొడుకులు ఉంటాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉండవచ్చు. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాను విస్మరించవద్దు. భాగస్వాములతో సంబంధాలలో అవగాహన, సమన్వయం పెరగడానికి సమయం పట్టొచ్చు.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రాశి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి సహాయం అందుకుంటారు. వ్యాపారపరంగా విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. మీ భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చించండి. లాంగ్ డ్రైవ్ లేదా సినిమా చూడటం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది.

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువే. భావోద్వేగాలను అదుపులో  ఉంచుకోవడం చాలా అవసరం. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. చేపట్టిన పనిలో సోదరుల నుంచి సహకారం ఉంటుంది.  సంబంధంలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీ భాగస్వామిని నమ్మండి...మూడో వ్యక్తి జోక్యం వల్ల బంధంలో చీలిక పెరగొచ్చు. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. 

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రోజు ఏదో విషయంలో బాధ వెంటాడుతుంది. కోపం తగ్గించుకోండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.  మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. మేధోపరమైన పని ఆదాయాన్ని పెంచే సాధనంగా మారుతుంది. పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. మీ భాగస్వామి ప్రవర్తనలో కొంత మార్పు ఉంటుంది. దీని వల్ల మీరు కొంత అసౌకర్యానికి గురవుతారు. కూర్చుని మాట్లాడితే పరిష్కారం కాని సమస్య ఉండదని గుర్తుంచుకోవాలి.

Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. పూర్తి విశ్వాసంతో ఉంటారు. పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ కలలను సాకారం చేసుకునేందుకు జీవిత భాగస్వామితో చర్చించి ముందడుగు వేయడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. మీరు స్నేహితుల నుండి కూడా మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే సామర్థ్యం మీకుంది. ఇతరుల అభిప్రాయాలు మీ బంధాన్ని ప్రభావితం చేయకుండా ప్లాన్ చేసుకోవాలి. మీ భాగస్వామితో మీ ఆర్థిక పరిస్థితిని చర్చించడానికి ఇది మంచి సమయం.

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది కానీ సంభాషణలో సమతుల్యతతో ఉండాలి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురోగతి కూడా ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలకు ఈరోజు మంచి రోజు. మీ భావాలను మీ భాగస్వామికి తెలియజేయండి. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. కార్యాలయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మరింత హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అదనపు ఖర్చులు ఉంటాయి.మీ భాగస్వామి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వారికి చూపించండి. ఇది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలపరుస్తుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. 

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

అనవసర కోపం తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుల నుంచి మంచి బహుమతులు అందుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీలో ఉన్న కొన్ని ఆందోళనలు భాగస్వామికి తెలియజేసేందుకు ప్రయత్నించాలి. ఇతరుల ప్రతికూల ఆలోచనలు మీ సంబంధాలను ప్రభావితం చేయనివ్వవద్దు. 

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏదో తెలియని ఇబ్బంది ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుని సహాయంతో వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget