Horoscope Today 09th July 2023: ఈ రాశివారు రహస్యాలు ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు, జూలై 9 రాశిఫలాలు
జూలై 9 రాశిఫలాలు: ఈ ఆదివారం మకరం, కుంభ రాశివారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి . మిగిలిన రాశులకు ఎలా ఉందో తెలుసుకోండి.
Horoscope Today 2023 July 09th: (జూలై 9 రాశిఫలాలు)
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు కాదు. సహోద్యోగులు ఏదైనా విషయంలో మీతో విభేదించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వివాహ సంబంధాలు వెతుక్కోవడం కోసం సమయం వెచ్చించాలి. ఆకస్మికంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీ కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. శుభవార్త వింటారు. భారీ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓర్పుతో చేసే పనిలో విజయం సాధిస్తారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు శ్రేయోభిలాషుల నుంచి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇతరుల మాటలకు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వొద్దు. వ్యాపార లక్ష్యాలు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు, షేర్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టవచ్చు.
Also Read: జూలై నుంచి అక్టోబరు వరకూ ఈ 4 రాశులవారికి మహారాజయోగం!
కర్కాటక రాశి
మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కొంతమంది మోసపూరిత వ్యక్తులు మీపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించవచ్చు. ఊహాత్మక ఆలోచనలకు దూరం పాటించండి. మీ శత్రువులు చాలా యాక్టివ్ గా మారుతారు మీరు అప్రమత్తంగా ఉండాలి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు పాత మిత్రులను కలుస్తారు. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. దినచర్యను క్రమశిక్షణగా పాటించండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. పిల్లల తప్పుడు ధోరణులను ముందుగా గుర్తించి సరిచేయండి.
కన్యా రాశి
ఈ రాశివారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి మీకు మంచి స్నేహితుడి పాత్రను పోషిస్తారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కుటుంబానికి సమయం కేటాయించండి. అనవసర వాగ్ధానాలు చేయొద్దు.
తులా రాశి
ఈ రాశివారు అవసరమైన పనులను పూర్తి చేస్తారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. మనసులో ఏదైనా భయం ఉంటే అది తొలగిపోతుంది. మతపరమైన యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి.
వృశ్చిక రాశి
సన్నిహితుల సలహాపై శ్రద్ధ వహించండి. పిల్లల విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణ పనులు త్వరలో పూర్తి అవుతాయి. ప్రేమకు సంబంధించిన విషయాలలో నిరాశ ఎదురవుతుంది. క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది.
Also Read: ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు
ధనుస్సు రాశి
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి...లేదంటే అనారోగ్యం తప్పదు. యోగా ప్రాణాయామంపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనుకున్న పనులు పూర్తికాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ త్వరలోనే మీకు మంచి రోజులున్నాయి.
మకర రాశి
ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిమ్మల్ని అందరూ నమ్ముతారు. విదేశాల్లో విద్యను అభ్యసించేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవివాహితులకు పెళ్లి సంబందాలు కుదురుతాయి.
కుంభ రాశి
ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండకండి. కుటుంబ పరంగా ఈ రోజు మంచి రోజు. పెద్దల సూచనలు పాటించడం మీకు చాలా ప్రయోజనకరం. అన్నదమ్ముల గురించి ఆందోళన చెందుతారు. అనవసర విషయాలకు సమయం వృధా చేయొద్దు.
మీన రాశి
ఈ రోజు ఆరోగ్యంపై దృష్టిసారించండి. కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులకు అనుకూల సమయం ఇది. ఉద్యోగులకు శుభసమయం. మీ చుట్టూ వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.