అన్వేషించండి

Horoscope Today Dec 30th, 2023: మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయం, డిసెంబరు 30 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 30th, 2023 ( డిసెంబరు 30 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఆరోగ్యం,ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  మీ వృత్తి జీవితంలో పురోగతిని పొందుతారు. అత్యవసర పనులను జాగ్రత్తగా నిర్వహించండి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఈ వారం డబ్బుకు కొంత కొరత ఉండవచ్చు. మీ ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితం బావుంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ సమయంలో తమ నిగ్రహాన్ని కోల్పోవచ్చు దాని కారణంగా సమస్యలు పెరుగుతాయి. కార్యాలయంలో తెలివిగా పని చేయండి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారులు తమ నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. 

Also Read: 2024 ఈ రాశివారితో చెడుగుడు ఆడేసుకుంటుంది!

మిథున రాశి (Gemini Horoscope Today) 

మీ బంధంలో చాలా మార్పు చూస్తారు. అవివాహితులు జంటను వెతుక్కునే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఇంటర్యూలకు హాజరయ్యే వారు విజంయ సాధిస్తారు. శృంగార సంబంధిత సమస్యలను సానుకూలతతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కష్టపడి పని చేయండి.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. కార్యాలయంలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటాయి అయితే ఈ మార్పులు మీ పురోగతికి మార్గాలను సూచిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనండి. ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉన్న కొత్త అవకాశాల కోసం చూడండి. 

Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!

సింహ రాశి (Leo Horoscope Today)

వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. మీ ఆలోచనలు,ప్రణాళికలు భాగస్వామితో పంచుకోవడం ద్వారా లక్ష్యాలను సాధించడం సులువు అవుతుంది. కార్యాలయంలో చాలా ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి మీ మేధో నైపుణ్యాలు అవసరమవుతాయి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునేటప్పుడు మీపై నమ్మకంతో ఉండండి.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

మీ ప్రతిభను ప్రదర్శించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి , మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇదే సమయం. మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి.  ఆర్థిక పురోగతి మార్గంలో మార్గనిర్దేశం చేస్తుంది. మీ ఆరోగ్యంపై  శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి. ధ్యానంపై దృష్టి సారించండి.

తులా రాశి (Libra Horoscope Today) 

అవివాహితుల నిరీక్షణ ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగులు పనిలో సవాళ్లు ఎదుర్కొంటారు కానీ దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి. మీపై అభిమానం నటిస్తూ పైకి ఎదగాలని చూసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

మీ జీవితంలోకి కొత్త వ్యక్తులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. కొత్తగా పెళ్లయిన వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో మంచి క్షణాలను గడపుతారు. ఈ రోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఉద్యోగులు, వ్యాపారులకు శుభఫలితాలున్నాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు కొన్ని కొత్త బాధ్యతలు పొందుతారు. అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది

మకర రాశి (Capricorn Horoscope Today) 

మార్కెటింగ్ వారికి ఈ రోజు మంచి రోజు...మీ లక్ష్యాలను చేరుకుంటారు. కార్యాలయ రాజకీయాలు మీపై ప్రభావం చూపిస్తాయి. స్థిరాస్తులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆన్ లైన్ బెట్టింగులకు దూరంగా ఉండడమే మంచిది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవాలి. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీపై మీకు విశ్వాసం ఉండాలి. పురోగతికి కొత్త అవకాశాలుంటాయి. అయితే వృత్తి జీవితంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. కార్యాలయం సవాళ్లు, అడ్డంకులను అధిగమించడానికి మీపై విశ్వాసం కలిగి ఉండండి. పరిస్థితికి తగ్గట్టుగా ఉండటం మీ ప్రత్యేక లక్షణం. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. భవిష్యత్ లో ఆర్థిక పరిస్థితి కోసం ప్రణాళికలు రచించడం మంచిది.

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశివారి నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త వ్యాపార ఆలోచనలు ప్రారంభిస్తారు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో తొందరపడొద్దు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమికులు సంతోషంగా ఉంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget