Horoscope Today: ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు..వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులు బదిలీలు, ప్రమోషన్ల గురించి సమాచారం తెలుసుకుంటారు. మీ మాటపై సంయమనం పాటించండి. పిల్లల వైపు సమస్య తొలగిపోతుంది. అప్పులు ఇవ్వొద్దు. చాలా పనులు సులువుగా పూర్తవుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.స్నేహితుడితో విభేదాలు ఉండొచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వాహనం జాగ్రత్తగా నడపండి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.
వృషభం
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు తీసేయండి. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త చేయండి. రిస్క్ తీసుకోకండి.
మిథునం
విజయానికి చేరువలో ఉంటారు. ఉత్సాహంగా ముందుకు సాగండి. అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. అనవసర మాటలు నియంత్రించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. పని ప్రదేశంలో శుభఫలితాలు పొందుతారు. వృద్ధులకు సేవ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం గురించి కొంచెం అవగాహన కలిగి ఉండటం అవసరం.
కర్కాటకం
ఈ రోజు మీకు మంచి రోజు. ఏదో సమస్య గురించి ఆందోళన చెందుతారు. పెద్ద పెద్ద లక్ష్యాలను ఆలోచించడం ద్వారా చిన్న విషయాలను విస్మరిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఇంటి సభ్యుడి ఆరోగ్యంలో సమస్య ఉండొచ్చు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక శక్తి ఉన్నప్పటికీ, నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అంతమాత్రాన మీ గుర్తింపు దెబ్బతినదు. క్షణికమైన ఆనందాల కోసం తాపత్రయపడకండి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి శుభ ఫలితాలను పొందుతారు.
సింహం
చాలా కాలంగా పనిచేస్తున్న ప్రణాళిక ఈ రోజు ఫలవంతమవుతుంది. డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో ఆశించిన విజయం సాధిస్తారు. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఈ రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ఈరోజు శత్రువుల నుంచి జాగ్రత్త అవసరం.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
కన్య
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొంత సమస్య ఉండొచ్చు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కార్యాలయ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.
తుల
ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రోజంతా బిజీగా ఉంటుంది. బాగా అలసటగా అనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు రుణం తీసుకునే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఓ దుర్వార్త వింటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి స్పందించండి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి.
వృశ్చికం
శుభవార్త వింటారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుస్తారు. రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. ఒత్తిడి తీసుకోవద్దు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో వివాదానికి అవకాశం ఉంది. ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
ధనుస్సు
ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టేందుకు శుభసమయం. స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు బదిలీ సంబంధిత సమాచారం పొందుతారు. వివాదాలు జరిగే అవకాశం ఉంది...అసభ్య పదాలు ఉపయోగించవద్దు. వ్యాపార సంబంధిత పనిపై ప్రయాణం చేస్తారు. అపరిచితులతో అనవసర చర్చలు వద్దు.
మకరం
ఈ రోజు మీరు చాలా పనుల్లో విజయం సాధిస్తారు. మీ సమయాన్ని మతపరమైన పనుల్లో గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వివాహితులు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ పనినైనా అత్యంత చిత్తశుద్ధితో పూర్తి చేయండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లలతో సమయం గడపండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. అధిక కోపం, చిరాకు ఉంటుంది.
కుంభం
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి కొత్త సమాచారం అందుతుంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు కొత్త బాధ్యతను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులతో వివాదం ఉండొచ్చు. కోపాన్ని నియంత్రించుకోండి. మాట మీద సంయమనం ఉండాలి. మీ పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయి. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధన లాభం పొందే అవకాశం ఉంది.
మీనం
ఈ రోజంతా మీరు సానుకూలంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా పాత సమస్య నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బయటి ఆహారాన్ని తినొద్దు.
lso Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి