Horoscope Today: ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు.. ఆ రాశుల వారికి నిర్లక్ష్యంతో అనారోగ్య సమస్యలు
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 31 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఏదైనా పని ప్రారంభించే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఈ రోజు మీ భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని మీరు చాలా నియంత్రణలో ఉంచుకున్నారు. ఈ రోజు ఏదో ఒక చర్చ జరగవచ్చు. ఎదుటివారు బాధపడే పదాలు ప్రయోగించవద్దు. కొన్ని విచారకరమైన సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి.
వృషభం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు అంత అనూకూలంగా లేదు. ఈ రోజు మీ భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అవసరాలను తీర్చండి.
మిథునం
ఈరోజు వ్యాపారంలో ఆహ్లాదకరమైన ఫలితాలు ఉండవు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు పెరగవచ్చు. అనుకోని ఖర్చులు చాలా అవుతాయి..కాస్త ఖర్చులు నియంత్రించే ప్రయత్నం చేయండి. కార్యాలయంలోనూ సవాళ్లు ఎదురవుతాయి.
కర్కాటక రాశి
మీకు అదృష్టం కలిసొస్తుంది. కుటుంబంలోని ఒకరికి అనారోగ్య సమస్యలున్నాయి. ఇతరులకు సహాయపడే భావన ఉంటుంది. నిత్యం మీరు చేసే పనిలో ఎలాంటి మార్పులు చేసుకోవద్దు. త్వరలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
సింహం
ఈరోజు మనసులో అన్నీ ప్రతికూల ఆలోచనలే నెలకొంటాయి. చిరాకు, మొండితనం పెరుగుతుంది. ఇదే మీకు హాని కలిగించవచ్చు. విద్యార్థులకు శుభసమయం. పెట్టిన పెట్టుబడినుంచి లాభాలు పొందుతారు. పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
కన్య
ఈరోజు మీకు ప్రతికూల పరిస్థితి తలెత్తవచ్చు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి..గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజు మీరు స్ట్రాంగ్ గా ఉంటారు..మీ పనితీరులోనూ ఇది కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. మీ సొంత సామర్థ్యాన్ని నమ్మండి.
తులారాశి
ఈరోజు మీరు ఓ పనికి సంబంధించిన సమస్య ఎదుర్కోవచ్చు. స్నేహితులను కలుస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెట్టుబడి ప్రతిపాదనలు వస్తాయి. వివాదాల్లో తలదూర్చకండి. పనులు వాయిదా వేయొద్దు.
వృశ్చికరాశి
వ్యాపారంలో నిరాశపరిచే ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు. ఇష్టదైవారాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. విద్యార్థులకు రోజు బాగుంటుంది. మీరు ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండండి.
ధనుస్సు
అన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. మీ సామర్థ్యాన్ని బట్టి విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
మకరం
స్నేహితులతో సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అధికారుల ప్రవర్తనతో ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదు. పనిచేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. బంధువుల నుంచి శుభవార్తలు అందుకోవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది.
కుంభం
ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త అనుభూతిని పొందుతారు. చిన్న సమస్య విషయంలో మీ కుటుంబ సభ్యుడిని జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కార్యాలయ వాతావరణం బాగుంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. కొత్త ప్రణాళికలు వేస్తారు.
మీనం
ఈ రోజు మంచిపనుల కోసం ఖర్చుచేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.పనులన్నీ చకచకా పూర్తిచేయాలనే తొందరపాటు వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారం బాగా సాగుతంది. ఉద్యోగస్తులకు పరిస్థితి అనుకూలంగా ఉంది. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.
Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!
Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?
Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?