News
News
X

Horoscope Today : కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ రాశుల వారికి మంచిరోజు..ఈ రాశి నిరుద్యోగులకు కాస్త ఊరట

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

ఆగస్టు 30 సోమవారం రాశిఫలాలు

మేషం

ఈ రోజు పెట్టుబడి పెట్టేందుకు మంచి రోజవుతుంది. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. బయటి ఆహారం తీసుకోవద్దు. మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు కలిసొస్తుంది.

వృషభం

ఈ రోజు వృషభ రాశివారి ఆర్థిక స్థితి బావుంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. స్నేహితులను కలవడం ద్వారా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వృద్ధులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు బదిలీలు ఉండొచ్చు.

మిథునం

ఈ రోజు మీరు అనవసరంగా ఖర్చు తగ్గించండి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజవుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యసనాలకు దూరంగా ఉండండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీకు బాగా కలిసొచ్చే రోజు. వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి అభిప్రాయంతో ముందడుగేస్తే విజయం సాధిస్తారు. తెలియని వ్యక్తులతో అనవసర ప్రసంగాలు వద్దు.Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం

సింహం

చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఈరోజు పూర్తవుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. అనుకోని వివాదాలు చుట్టుముడతాయి...మీరు సంయమనం పాటించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. మీ వ్యక్తిగత ప్రణాళికలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు.

కన్య

కన్యరాశివారి ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. మీ భాగస్వామ్యంలో చేస్తున్న పనిలో లాభాలొచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో విజయం ఉంటుంది. రిస్క్ చేసి ప్రాణాలపై తెచ్చుకోవద్దు.

తులారాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బయట ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలున్నాయి. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు.

వృశ్చికరాశి

అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ ప్రవర్తనతో అందరి అభినందనలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా  ఉంటారు. ఈరోజు ప్రయాణాలు చేయొద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

Also Read: ఈ రాశుల వారు ఈ వారం అపరిచితులతో చర్చలు పెట్టొద్దు. ఈ ఆరు రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది..

ధనుస్సు

స్నేహితులను కలుస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పని ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఓ అడుగు ముందుకు పడుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశమై..కొత్త కొత్త ప్రణాళికల గురించి చర్చిస్తారు.

మకరం

ఈ రోజంతా ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వ్యాపారం మామూలుగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో వ్యక్తిగత చర్చలు చేయవద్దు. టెన్షన్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.

కుంభం

వ్యాపార భాగస్వాములతో సామరస్యం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. మీ ప్రతిభను మెరుగుపరచుకోవడానిక ప్రయత్నించండి. వ్యక్తిగత, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మమంచి నడవడికతో ప్రశంసలు పొందుతారు.

మీనం

టెన్షన్ తగ్గుతుంది. నిరుద్యోగులకు ఇది శుభసమయం. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. బయట తినడం మరియు తాగడం మానుకోండి.

Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!

Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?

Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

Published at : 30 Aug 2021 06:18 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces August 30

సంబంధిత కథనాలు

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Navratri 2022: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Navratri 2022:   ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Zodiac signs: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

Zodiac signs: ఈ రాశులవారికి  సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

టాప్ స్టోరీస్

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన