News
News
వీడియోలు ఆటలు
X

మే 9 రాశిఫలాలు, ఈ రాశులవారు కోపాన్ని అదుపుచేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు

Rasi Phalalu Today 9th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మే 9 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారి శని, కుజుడి సంచారం కుటుంబ సమస్యలు తెచ్చిపెడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మాట తూలొద్దు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. మీ ఆలోచన ప్రత్యేకంగా ఉంటుంది. తక్షణ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేయకండి. భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. 

వృషభ రాశి
ఈ రాశివారు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. రోజంతా ఆనందంహా ఉంటారు.  సన్నిహితులు, బంధువులను కలుస్తారు.ఆర్థిక ప్రయోజనం ఉండవచ్చు. వ్యాపారులకు లాభదాయక సమయం. మీరు గౌరవాన్ని పొందగలుగుతారు.

మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు విజయాన్ని అందుకోగలుగుతారు. మీ ఇంట్లో, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా ఉంది. పెట్టుబడి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. విద్యార్థులు పరీక్షలలో  విజయం సాధిస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శని, కుజ గ్రహాలు మీకు మంచి చేస్తాయి. 

కర్కాటక రాశి 
శని కుజ గ్రహం సంచార ప్రభావం మీ ఆరోగ్యంపై ఉండొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువులతో వాగ్వాదం పెట్టుకుంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఈ రోజు ఆసక్తి ఉండదు.

Also Read: మే 8 నుంచి 14 వీక్లీ రాశిఫలాలు, ఈ 6 రాశులవారికి ఆర్థికలాభం, వ్యవహారజయం

సింహ రాశి 
ఈ రాశివారు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. ఈరోజు మీలో ఏదో నిరాశ నిండి ఉంటుంది. మనస్సు అశాంతిగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.ఈరోజు ఇల్లు, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్త వహించండి. సన్నిహితులను కలుస్తారు.

కన్యా రాశి
ఈ రోజు తొందరపడి ఏ పనీ చేయకండి. సరైన మార్గంలో ప్రయత్నిస్తే కచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై  పైచేయి సాధిస్తారు.  పొరుగువారు, స్నేహితులతో మీ సంబంధాలు చాలా బలపడతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. మీపనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది.

తులా రాశి 
ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. అధికార పక్షం నుంచి మద్దతు ఉంటుంది. గృహోపకరణాలు పెరుగుతాయి. సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. మొండితనం తగ్గించుకోవాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి.  గందరగోళం మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.  ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి 
కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సంపద, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులు ,స్నేహితులతో సరదాగా గడుపుతారు. సామాజిక సంబంధాలకు కూడా అవకాశాలు ఉంటాయి. దంపతులు సంతోషంగా ఉంటారు.  శుభకార్యాల్లో పాల్గొనేందుకు బయటకు వెళ్లాల్సి రావచ్చు. సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. 

ధనుస్సు రాశి
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తికావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఏదో విషయంలో మనసులో బాధ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కోర్టులు సంబంధించిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కొరత ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ రాశివారు తెలివితేటలు, మాట సరిగ్గా వినియోగించుకుంటే శుభఫలితాలు పొందుతారు

మకర రాశి 
ఈ రాశివారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.  బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ప్రత్యేక ప్రయోజనాలను పొందగలుగుతారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. 

కుంభ రాశి 
శని, కుజ గ్రహాల ప్రభావం వల్ల మీపై మానసిక ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చేసిన ప్రయత్నం అర్థవంతంగా ఉంటుంది.. పనుల్లో జాప్యం తప్పదు. వ్యాపారులు విజయం సాధిస్తారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశం ఉంది. 

మీన రాశి 
మానసిక గందరగోళం కారణంగా సమస్యలు ఉంటాయి. ఏదో విషయంలో భయపడతారు. ఆరోగ్య సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. ప్రత్యర్థులు మీ మార్గంలో సమస్యలను సృష్టించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. 

Published at : 09 May 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 9th May 9th May Astrology

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ