News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 8 రాశిఫలాలు, ఈ రాశులవారికి అన్నింటా పురోగతి - శత్రువులు కూడా ఎక్కువే!

Rasi Phalalu Today 8th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

2023 ఏప్రిల్ 8 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారి దృష్టి ఆధ్యత్మికతవైపు మళ్లుతుంది. న్యాయపరమైన అంశాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. స్నేహితులను కలుస్తారు.  కానీ మానసికంగా అశాంతికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది

వృషభ రాశి

ఈ రాశి వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు నెరవేరుతాయి. ఇతరుల నుంచి ఎక్కువగా ఏమీ ఆశించవద్దు. శత్రవులు యాక్టివ్ గా ఉన్నారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. కొన్ని తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ఉండడమే మంచిది. 

మిధున రాశి

ఈ రాశివారికి భూమికి సంబంధించిన పనులు పెద్ద లాభాలను అందిస్తాయి. ఉద్యోగం, ఉపాధిలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. సన్నిహితుల మద్దతు లభిస్తుంది. రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. వీరికి సోమరితనం ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది.

కర్కాటక రాశి

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలసి దూర ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది...నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడొద్దు. బంగారం, వెండి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మాటల విషయంలో సంయమనం పాటించండి. తెలియని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. 

Also Read: మానసిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వివాదాలు - శుక్రుడి సంచారం ఈ 6 రాశులవారికి అస్సలు బాలేదు

సింహ రాశి

ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని అశుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆశించిన పనులకు ఆటంకాలు కలగవచ్చు. భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారంలో వేగం మందగిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. మీ చుట్టూ ఉన్నవారు కొందరు మీకు హానికలిగిస్తారు జాగ్రత్త.

కన్యా రాశి 

ధార్మిక పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కొత్త పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆనందం ఉంటుంది. కుటుంబ సహకారం అందుతుంది. సంతోషంగా ఉంటారు. ప్రమాదకర పనులు అస్సలు చేయకండి

తులా రాశి

ఈ రాశివారికి ధైర్యం పెరుగుతుంది. ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేసేందుకు ప్రణాళికలు రచిస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ సామాజిక స్థితిపై కొనసాగుతున్న ఆందోళన తొలగిపోతుంది.

వృశ్చిక రాశి 

జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. అనుకోని బహుమతులు అందుకుంటారు. బంధువులను కలవడం వల్ల మీరు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. డబ్బు చేతికందుతుంది. ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులను కలుసుకోవడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. మీ అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

ధనుస్సు రాశి 

నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోండి. ప్రయాణాలలో కొంత ఇబ్బంది కలగవచ్చు. అనవసరమైన ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉండకండి. తలపెట్టిన పని పూర్తవ్వాలంటే మీ విచక్షణ ఉపయోగించండి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సోమరితనం వల్ల నష్టం ఉంటుంది.

Also Read: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

మకర రాశి

మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని పొందవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారంలో పెద్ద సమస్య రావచ్చు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఒకరి మాటల వల్ల బాధపడవచ్చు. చట్టపరమైన అడ్డంకులు ఉండవచ్చు.

కుంభ రాశి

మీపట్ల విశ్వసనీయత పెరుగుతుంది. ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. సంతోషంగా ఉంటారు. కెరీర్ విషయంలో మరింత పరుగు ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం సమకూరుతుంది. సంతోష సాధనకు ఖర్చు ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పనుల్లో పురోగతి ఉంటుంది.

మీన రాశి

న్యాయపరమైన మద్దతు లభిస్తుంది.  నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. మంత్ర-తంత్రాలపై ఆసక్తి ఉంటుంది. మంచివ్యక్తులను కలుస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలసట అనిపించవచ్చు.

Published at : 08 Apr 2023 05:20 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today April 8th Horoscope 8th April Astrology Horoscope for 8th April 8th APril Horoscope

సంబంధిత కథనాలు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా