Horoscope Today 6th October 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్నేహితుడు వస్తాడు, అక్టోబరు 6 రాశిఫలాలు
Horoscope Today 6th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 6th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి కానీ అదే సమయంలో అందుకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. మీ అతిథులతో చెడుగా ప్రవర్తించవద్దు. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులను బాధపెట్టడమే కాదు దూరాన్ని కూడా పెంచుతుంది. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
వృషభ రాశి
ఈ రోజు మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫీలవుతారు. చాలా రోజులుగా కార్యాలయంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ప్రేమవ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
మిథున రాశి
స్నేహితులు, ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉంటారు. కుటుంబం , స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు.
Also Read: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!
కర్కాటక రాశి
ఈ రోజు పనిభారం మీకు చికాకును తెప్పిస్తుంది. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగేయండి. రోజు ఉదయం నుంచి కాస్త డల్ గా ఉన్నా సాయంత్రం ఓ శుభవార్తవింటారు..మీ సంతోషం పెరుగుతుంది.
సింహ రాశి
ఇంటి పెద్దల ఆశీస్సులతో ఏదైనా తలపెడితే సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. ఆఫీసులో కొన్ని కొత్త బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు
కన్యా రాశి
మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్నేహితుని రాకతో ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
తులా రాశి
పెట్టుబడికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది. మీరు ఎప్పటినుంచో నమ్ముతున్నది నిజంగా నమ్మదగినది కాదని తెలుసుకుని ఈరోజు మీరు చాలా బాధపడతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు ప్రయాణాలు సాగుతాయి. ఆఫీసు పని కోసం బయటకు వెళ్ళవలసి రావచ్చు, ఈ రోజంతా బాగుంటుంది. ఇంటికి దూరపు బంధువు రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ స్నేహితులు కూడా ఇంటికి వస్తారు.మీరు తలపెట్టే పనులకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది.
Also Read: ఈ 5 రాశులవారు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు
ధనుస్సు రాశి
మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి
ఓ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని తెలుసుకోవడం మంచిది. ఇతరులను ఆకట్టుకోవడానికి అదనపు డబ్బు ఖర్చు చేయకండి. మీ వ్యక్తిత్వానికి కొందరు ఆకర్షితులవుతారు.
కుంభ రాశి
ఈ రోజు అదృష్టం మీకు కలిసొస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ధనలాభంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. వివాహితులకు ఈరోజు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది.
మీన రాశి
ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన ప్రణాళికను వేస్తారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాల కారణంగా మీ మానసిక ఆందోళన పెరుగుతుంది. మీ మంచి ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.