Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!
అనుభవంతో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తిండిపోతాయి.అలాంటి అనుభవాలు చెప్పేఅవకాశం ఆఖరి క్షణంలో వస్తే అవి మరొకరి జీవితానికి మంచి పాఠాలవుతాయి. రావణుడి నుంచి లక్ష్మణుడు నేర్చుకున్నది ఇదే!
Dussehra Ravan Dahan 2022: రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి వద్దకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోమని రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని ఆదేశిస్తాడు. బ్రాహ్మణోత్తముడు, రాజు అయిన రావణుడు అప్పుడు లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే..
- రథ సారథితో, పాలవాడితో, వంటవాడితో, నీ సోదరులతో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి...వాళ్ళతో శతృత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎట్నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా వెనుకాడరు. ( సోదరుడైన విభీషణుడిని దూరం చేసుకుని రావణుడు కష్టాలు కోరి తెచ్చుకున్నాడు)
- నీతో ఉంటూ నిన్న విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు ( ఈ విషయం అర్థంకాకే ఎవరు మనవారో, ఎవరు బయటివారో, ఎవరు మన మంచికోరుకుంటున్నారో,ఎవరు ముంచేవారో తెలుసుకోలేకపోతున్నారు)
- ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు ( నీ గెలుపుపై నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు)
- నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను.
- రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశపరుడై ఉండకూడదు. ( గెలవాలి అనుకోవడం వేరు ఎదుటివారు నాశనం అయిపోవాలి అనుకోవడం వేరు...ఈ రెండింటి మధ్య ఉన్న స్వల్ప వ్యత్యాసం గమనించిన వారే నిజమైన విజేత)
Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
- దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు.. కానీ ఏదైనా కూడా అపారమైన ధృఢ నిశ్చయంతో ఉండాలి. ( ఈ తరంలో దేవుడున్నాడు, లేడని రెండు రకాల విషయాలపై వితండం వాదం చేసేవారికి వర్తిస్తుంది ఇది ఎందుకంటే దేవుడున్నాడు లేడన్న విషయంలో ఎవరి వాదన వారిది. వాళ్లు దాన్ని బలంగా నమ్మడంలో తప్పులేదు కానీ ఎదుటి వారి అభిప్రాయాన్ని తప్పుపట్టడం తప్పు)
- ఇతరులకు,సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలిసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది. ( ఈ విషయంలో రాజకీయాలు, కార్యాలయాల్లో బాస్ లకు వర్తిస్తుంది. అన్నింటా తామే కనిపించాలనే ఉద్దేశంతో పనంతా తామే చేసేసుకుంటారు, కానీ రాజు మీన్స్ బాస్ అలసిపోకుండా తన టీమ్ తో సరైన వర్క్ చేయించాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినప్పుడే విజయం సొంతం అవుతుంది)
- ఈ విషయాలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు విడిచాడు రావణుడు. అయితే రావణుడు చెప్పిన మాటలు కేవలం పురాణాల్లో వారికి మాత్రమే కాదు ఈ తరానికి, పాలకులకు కూడా వర్తిస్తాయనేందుకే కొంతలో కొంత వివరణ.
Also Read: విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు
దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం. దసరా రోజున రావణుని దిష్టి బొమ్మను తగులబెట్టడం వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు రావణుడిపై దండెత్తి వెళ్లి విజయం సాధించిన రోజిదే కావడంతో రావణుని దిష్టి బొమ్మ తగులబెట్టే సంప్రదాయం మొదలైంది.