Ayudha Pooja 2022 : విజయ దశమికి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు
వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేస్తారు. పనిముట్లు, యంత్రాలు, వాహనాలను శుభ్రం చేసి శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటారు. ఇంతకీ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
Ayudha Pooja 2022 : విజయదశమి పర్వదినం సందర్భంగా ఆయుధ పూజ చేస్తారు. శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ మూడురోజుల్లో కొందరు దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తే...మరికొందరు మహర్నవమి...ఇంకొందరు దశమి రోజు ఆయుధపూజ చేస్తారు. ఈ పూజకు ఎంతో పాధాన్యత ఉంది.
పురాణాల ప్రకారం
దేవతలు, రాక్షసుల మధ్యన జరిగిన సంగ్రామంలో ఉత్తరాషాడ శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో దేవతలు రాక్షసులపై విజయం సాధించారు. ఆసందర్భాన్ని పురస్కరించుకుని విజయదశమికి ఆయుధాలకు పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుంది. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రత సంతరించుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేందుకు అర్జునుడు జమ్మిచెట్టు తొర్రలో దాచి ఉంచిన ఆయుధాలను విజయదశమికి ఒకరోజు ముందు క్రిందికి తీసి పూజలు నిర్వహించి యుద్ధానికి బయలు దేరతాడు. ఆయుద్ధంలో విజయం సాధించటంతో ఆ విజయాలకు గుర్తుగా అప్పటి నుంచి ఆయుధపూజ ప్రారంభమైందని మరో కథనం ప్రాచుర్యంలో ఉంది.
Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆయుధం చేపట్టి దుర్గాష్టమి రోజున దుర్గముడు అనే రాక్షసుడిని , మహా నవమి నాడు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడంతో ఆయుధాలను శక్తి స్వరూపిణిగా భావించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయుధాల శత్రు సంహారానికి మాత్రమే వినియోగించాలని, ఆయుధం దుర్వినియోగం చేయకూడదని ఈ ఆయుధ పూజ ఉద్దేశం. లలిత సహస్ర నామాల్లో చెప్పినట్టు సర్వేశ్వరీ సర్వ మయి సర్వ మంత్ర స్వరూపిణి...అంటే సర్వ యంత్రాల్లనూ, మంత్రాల్లోనూ, తంత్రాల్లనూ అన్నిచోట్లా లలితామాత ఉందని అర్థం. ఆయుధ పూజ చేయడం ద్వారా అమపృత్యు దోషాలుండవని, వాహన ప్రమాదాలు జరగవని నమ్మకం. అందుకే వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వృత్తి పనివారంతా దుర్గాష్టమిరోజు తాము ఉపయోగించే పనిముట్లను,యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు. పోలీసులు తాము వినియోగించే లాఠీ,తుపాకులు వాహనాలు - రైతులు అయితే కొడవలి,నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు - టైలర్లు కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయుధ పూజ చేసేటప్పుడు ఓం దుం దుర్గాయైనమః అనే మంత్రాన్ని పఠించాలి.
Also Read: మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!
చురిక పూజ
సర్వాయుధానం ప్రథమం నిరిమ్తసి పినాకినా |
శూలాయుధాన్ వినిష్కృత్య కృత్వా ముష్టిగ్రహం శుభమ్ ||
ఛురికే రక్ష మాం నిత్యం శాంతి యచ్చ నమోస్తు తే ||
కఠారికా పూజ
రక్షాంగాని గజన్ రక్ష రక్ష వాజిధనాని చ |
మమ దేహం సదా రక్ష కట్టరక నమోస్తుతే ||
శంఖ పూజ
పుణ్యస్త్వం శంఖ పుణ్యానాం మంగళానాం చ మంగళం |
విష్ణునా విధృతో నిత్యమతః శాంతిం ప్రయచ్చ మే ||