News
News
X

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Dussehra 2022: శరన్నవరాత్రులు సందర్భంగా రావణ దహన వేడుకలు జరుపుతారు. రావణుడు అంటే రాక్షసుడు అని మాత్రమే తెలుసు..కానీ దశకంఠుడి బాల్యం నుంచి మరణం వరకూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

FOLLOW US: 

Dussehra 2022: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం. దసరా రోజున రావణుని దిష్టి బొమ్మను తగులబెట్టడం వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు రావణుడిపై దండెత్తి వెళ్లి విజయం సాధించిన రోజిదే కావడంతో  రావణుని దిష్టి బొమ్మ తగులబెట్టే సంప్రదాయం మొదలైంది. రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏంటంటే  పరస్త్రీ వ్యామోహంలో పడినవారు, వేధింపులకు గురిచేసేవారు  ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారనే సందేశం కూడా ఉందంటారు. అందుకే మనిషిలో కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది. అయితే రావణుడు  కేవలం విలన్‌గానే తెలుసు కానీ రావణ బ్రహ్మ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర విషాయలున్నాయి...అవేంటంటే...

Also Read: మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!

  • రావణుడు సగం బ్రాహ్మణుడు-సగం రాక్షసుడు. రావణుడి తండ్రి  విశ్వ వసు బ్రహ్మ ( ఈయన బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు). రావణుడి తల్లి కైకసి ( రాక్షస వంశానికి చెందిన సుమాలి కుమార్తె).  విశ్వావసుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య  వరవర్ణినికి పుట్టిన వాడు కుబేరుడు. రెండో భార్య కైకసికి పుట్టిన వారు రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు.
  • రావణుడికి చిన్నప్పటి నుంచీ సాత్విక స్వభావం లేదు. తండ్రి నుంచి వేదాలు, తాత నుంచి రాజ్యపాలనా విషయాలు నేర్చుకున్న రావణుడికి సర్వలోకాలు జయించాలనే కోరికతో ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే..అమరత్వం అడుగుతాడు. దాన్ని నిరాకరించిన బ్రహ్మ మరేదైనా కోరుకోమంటాడు. తనకు దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరగా సరే అంటాడు  బ్రహ్మ.
  • రావణుడికి పుట్టినప్పటి నుంచీ పేరు లేదు. పది తలలతో పుట్టడంవలన దశగ్రీవుడు అనేవారు. అయితే ఓసారి కైలాస పర్వతాన్ని చేతులతో పెకిలిస్తున్నప్పుడు  శివుడు తన కాలి వేలితో రావణుని ముంజేతులను నలిపేస్తూ పర్వతాన్ని నొక్కుతాడు. అప్పుడు చేసిన ఆర్తనాదం కారణంగా రావణుడు ( అరుస్తున్న వ్యక్తి) పిలిచారు.  అప్పటి నుంచి రావణుడికి ఆ పేరు స్థిరపడిపోయింది. రావణుడు శివుని గొప్ప భక్తుల్లో ఒకడు మాత్రమే కాదు.. శివ తాండవ స్తోత్రం రచించింది రావణుడే.
  • రావణుడు శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు  అనారణ్యను చంపాడు.  మరణిస్తున్నప్పుడు అనారణ్య తన వంశంలో జన్మించిన వ్యక్తి చేతిలో నీ మరణం తథ్యం అని శపిస్తాడు. ఆ శాపంలో భాగంగానే రాముడి చేతిలో రావణుడి మరణం సంభవించింది. 
  • ఎవరెవరు బలవంతుడో తెలుసుకుని వాళ్లతో యుద్ధం చేసి గెలవాలనే తాపత్రయంతో ఓసారి వాలిని చంపేందుకు వెళతాడు రావణుడు. సముద్ర తీరంలో సూర్యుడిని ప్రార్థిస్తున్న వాలిని సంహరించేందుకు ప్రయత్నించిన రావణుడిని...అత్యంత శక్తివంతుడైన వాలి మోసుకుంటూ కిష్కిందకు తీసుకెళ్లాడు. యద్ధం అవసరం లేకుండానే వాలిబలం తెలుసుకున్న రావణుడు స్నేహం చేయమని కోరుతాడు. అలా వాలి-రావణుల స్నేహం ఏర్పడింది.
  • రావణుడు తండ్రి విశ్వావసుడి నుంచి వేదం నేర్చుకున్నాడు. అందుకే ముహుర్తాలు నిర్ణయించడంలో దిట్ట. రాముడు లంకపై దాడి చేయడానికి, అందుకోసం వానరసేనతో రామసేతు నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించింది రావణుడే. అక్కడ వృత్తి ధర్మాన్ని పాటించిన రావణుడు రాముడికి విజయం వరించే ముహూర్తమే నిశ్చయించాడు. 
  • రావణుడు వేదాలతో పాటూ జ్యోతిష్యశాస్త్రంలో కూడా నిపుణుడు. కుమారుడు మేఘనాధుడు జన్మించినప్పుడు రావణుడు అన్ని గ్రహాలను, సూర్యుడిని తగిన స్థితిలో ఉండాలని ఆదేశించాడు. తద్వారా మేఘనాథుడు చిరంజీవిగా ఉండాలన్నది రావణుడి కోరిక. కానీ శని అకాస్మాత్తుగా తన స్థానం మార్చుకున్నాడు. ఇది గమనించిన రావణుడు శనిదేవుడిపై తన జడతో దాడి చేసి ఓ కాలు విరిచేశాడని చెబుతారు.
  • రామ రావణ యుద్ధంలో భాగంగా రావణుడిని చంపాలంటే నాభి వద్ద కొట్టాలని తన సోదరుడి మరణ రహస్యం చెప్పాడు విభీషణుడు. ఆ మాటని అనుసరించి రావణుడి నాభి వద్ద తన బాణాన్ని కొట్టి దుష్టసంహారం చేశాడు రాముడు.
  • తనకు దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని బ్రహ్మ దేవుడి నుంచి పొందుతాడు రావణుడు. అయితే మనుషుల నుంచి రక్షణ కోసం వరాన్ని కోరుకోలేదని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి రాముడిని సంహరించాడు. 

Also Read: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

News Reels

Published at : 04 Oct 2022 07:55 AM (IST) Tags: ravan dahan 2022 dussehra 2022 puja time Maha Navmi 2022 Kalaratri Mahagauri Navratri 2022 Ammavaari Avataralu Ravan Dahan biggest ravan dahan in india

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు