News
News
X

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Navratri 2022 Siddhidatri: నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మ అనుగ్రహించే రూపం సిద్ది ధాత్రి దుర్గ. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే....

FOLLOW US: 
 

Navratri 2022 Siddhidatri: దుర్గాదేవికి తొమ్మిది రూపాలు ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. అందులో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. నవదుర్గల్లో తొమ్మిదో అవతారం 'సిద్ధిదాత్రీ దుర్గ. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ  అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారని అర్థం. ఇహలోక సుఖాలనే కాక జ్ఞానాన్నీ,మోక్షాన్నీ కూడా సిద్దిధాత్రి దేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం. కుండలినిలోని అన్ని ద్వారాలనూ ఛేదించుకుని సాధించే మోక్షాన్ని మించిన పరమసిద్ధి ఏముంటుంది. అందుకు సూచనగానే అమ్మవారు వికసించిన కమలం మీద ఆశీనురాలైనట్లు దర్శనమిస్తుంది.

Also Read:  విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్దిధాత్రి దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మనుషులే కాదు..గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని భక్తులు చెబుతారు. నవరాత్రుల్లో చివరి రోజు బాలికలను పూజిస్తారు. బాలపూజ చేయడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, సకల కార్యాల్లో విజయం సాధిస్తామని భక్తుల విశ్వాసం.

News Reels

సిద్దిధాత్రి ప్రాముఖ్యత
సిద్ధి ధాత్రి కేతువుకి అధిపతి. క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. సిద్ధిదాత్రి దేవతను పూజించడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం, స్వీయ అన్వేషణ పెరుగుతుంది.

​సిద్దిధాత్రి మంత్రం
ఐం హ్రీం క్లీం చాముండాయై విచే
సిద్ధగందర్వ యాక్షాద్వై్ర్సురైర్మరైర్పి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

Also Read:  శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు - మహిషాసుర మర్థినిగా అమ్మవారి దర్శనం

సిద్దిధాత్రి ధ్యాన శ్లోకం 
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥ 

నవ దుర్గా స్తోత్రం

గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥

దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥

దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

శ్రీ మాత్రే నమః 

Published at : 04 Oct 2022 05:08 AM (IST) Tags: dussehra 2022 puja time Maha Navmi 2022 Durga Ashtami 2022 Date Chandraghanta Kushmanda Skandamata Katyayani Kalaratri Mahagauri Navratri 2022 Ammavaari Avataralu Vijayawada Kanaka Durga

సంబంధిత కథనాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శక్తి పీఠం?

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

Sri Krishna Temple: దక్షిణ అభిముఖ శైలి ఉన్న కృష్ణుడి ఆలయం- మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న అరుదైన గుడి!

టాప్ స్టోరీస్

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్