మార్చి 6 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి అతి పెద్ద కల సాకారమవుతుంది కానీ!
Rasi Phalalu Today 6th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
మేషరాశివారు ఈరోజు ఆహ్లాదకరంగా గడుపుతారు. మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే, అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశివారు బయటి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పని విషయంలో అనవసర ఒత్తిడికి గురికావొద్దు. మీ తోబుట్టువుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది..తిరిగి వారికి ఇచ్చేక్రమంలో మీరు ఆర్థిక ఒత్తిడికి గురవుతారు. అయితే త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది.
మిథున రాశి
ఇతరుల విజయాన్ని మెచ్చుకోవడం ద్వారా ఈ రాశివారు ఆనందిస్తారు. ఈ రోజు మీరు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు మీకు సంతోషంగా గడుస్తుంది. పనివిషయంలో నిర్లక్ష్యం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి
Also Read: హోలీ శుభాకాంక్షలు, కలర్ ఫుల్ విషెస్ చెప్పేయండిలా!
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. జీవితాన్ని సంతోషంగా ఎలా మలుచుకోవాలో అనే ఆలోచనలో ఉంటారు. ఆర్థిక విషయాలు, వ్యవహారాల్లో జాగ్రత్తపడాలి..లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. బద్ధకాన్ని వీడండి..మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవడం మంచిది
సింహ రాశి
ఈ రాశివారు వ్యాయామంపై దృష్టి సారించాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఇదే మంచి సమయం. మీ ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంతో సమయం గడుపుతారు.
కన్యా రాశి
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా చేసేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మీరు తల్లివైపు నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
తులా రాశి
ఈ రాశివారికి క్రీడలపై ఆసక్తి ఉంటుంది..ఇదే మీ ఆరోగ్యానికి కారణం అవుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు...కానీ ఏ చిన్న విషయంలో నిర్లక్ష్యం వహించినా ఆర్థిక నష్టం తప్పదు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక శుభవార్త వింటారు, కుటుంబంలో సంతోషం ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థికంగా అదిరింది, మార్చి 6 నుంచి 12 వారఫలాలు
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారి అతి పెద్ద కల సాకారమవుతుంది...అయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి..ఎందుకంటే అధిక ఆనందం సమస్యలకు కారణం కావొచ్చు. మీ జీవిత భాగస్వామితో కలసి..మీ భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు.
ధనుస్సు రాశి
ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చెడు ఆలోచనను మనసులోకి రానివ్వవద్దు...ఇది మీ జీవితంలో సమస్యలను పెంచుతుంది. ఓ సరైన వ్యక్తి ఆలోచనతో మీకు జ్ఞానోదయం అవుతుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు క్రీడలపై ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు తెలివిగా పెట్టుబడులు పెట్టండి. పాత మిత్రుల నుంచి సహయ సహకారాలు అందుకుంటారు.
కుంభ రాశి
కుంభరాశివారికి ఈ రోజు ఒత్తిడితో కూడుకున్న రోజు అయినప్పటికీ ఆరోగ్యం మాత్రం బాగానే సహకరిస్తుంది. బంధువుల కారణంగా ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతింటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడులపై కన్నా పనులపై శ్రద్ధ వహించాలి.
మీన రాశి
ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కారణంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలసి విలువైన సమయం గడుపుతారు. మానసిక బాధనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు.