News
News
X

ఈ వారం ఈ రాశులవారికి ఆర్థికంగా అదిరింది, మార్చి 6 నుంచి 12 వారఫలాలు

Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

మేష రాశి

ఈ వారం ఈ రాశివారు చాలా బిజీగా ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. త్వరలోనే శుభవార్త వింటారు. ఈ వారం ప్రయాణం చేయాల్సి వస్తుంది.  విదేశాల నుంచి నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు పనిప్రాంతంలో కొంత ప్రతికూలతను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధ్యానం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే ప్రణాళిక ఉంటుంది. కొత్త ఇల్లు కొనడానికి సమయం అనుకూలంగా ఉంది. మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ

వృషభ రాశి

ఈ వారం మీకు చాలా మంచి సమయం. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ వారం అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. లాభాలు ఆర్జిస్తారు. అవసరమైన వారికి సహాయం చేయండి. కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కానీ కాలం గడిచే కొద్దీ అంతా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు కలిసొచ్చే రంగు పింక్

మిథున రాశి

ఈ వారం ఈ రాశివారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీ దినచర్య మెరుగుపడుతుంది. మీరు మీ పనులను మరింత మెరుగ్గా నిర్వహించగలుగుతారు. కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది  లేకపోతే మానసిక సంఘర్షణ ఉండవచ్చు. దైవానుగ్రహం లభిస్తుంది. ఈ వారం మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు, తక్కువ శ్రమలో ఎక్కువ లాభం ఉంటుంది. మీకు కలిసొచ్చే రంగు ఎరుపు

Also Read: స్త్రీ శపథం చేస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి!

కర్కాటక రాశి

ఈ రాశి అవివాహితులకు వివాహం మరింత ఆలస్యమవుతుంది. ఈ వారం మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ధనలాభం పొందుతారు... కుటుంబానికి సమయం కేటాయించండి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మేయవద్దు. త్వరలోనే మీ జీవితంలో మార్పు వస్తుంది.  మంచి సమాచారం పొందుతారు.

సింహ రాశి

ఈ వారం సింహరాశికి చెందినవారు పోటీ పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన మంచి మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలపై పూర్తి అనగాహనతో ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. మీకు కలిసొచ్చే రంగు పర్పుల్

కన్యా రాశి

ఈ వారం ఆరంభంలో ఈ రాశివారికి ప్రయాణం చేయకతప్పదు. మీపై దైవానుగ్రహం ఉంటుంది. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, చాలా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ వహించండి. పని ఒత్తిడిలో కుటుంబాన్ని, జీవితభాగస్వామిని  విస్మరించవద్దు. ఏ కొత్త అవకాశం వచ్చినా ఆర్థికంగా లాభాన్నిస్తుంది. ఏ పనినైనా ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. మీకు కలిసొచ్చే రంగు నీలం

Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

తులా రాశి

ఈ వారం తులారాశివారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాళి మహిళలకు ఇది చాలా శుభ సమయం. బహుమతులు అందుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది.  ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు..ఇతరులకు ఇచ్చే సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు ఆలోచనాత్మకంగా పదాలను వాడండి. ఎవరినీ మోసం చేయవద్దు. ఈ వారం దానధర్మాలు చేయడం వల్ల మీ గ్రహస్థితి అనుకూలంగా ఉంటాయి. మీకు కలిసొచ్చే రంగు పసుపు.

వృశ్చిక రాశి

ఈ వారం ఈ రాశివారికి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఏ చిన్న అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. మీ కారణంగా కొందరు నష్టపోతారు, మీ గౌరవం తగ్గుతుంది. కొన్ని రోజుల పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ గొడవ పడకండి, నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో మాధుర్యం ఉంటుంది, కష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుతుంది. ఈ వారం తప్పకుండా ధ్యానం చేయండి..ఒడిదొడుకుల సమయంలో మీకు ధైర్యం లభిస్తుంది. మీకు కలిసొచ్చే రంగు నలుపు..

ధనుస్సురాశి 

ఈ వారం మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. పరిపక్వతతో పనిచేయాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇకరావు అనుకున్న చోటు నుంచి డబ్బులు చేతికి అందవచ్చు.  కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. ఎలాంటి చర్చల జోలికి వెళ్లకండి. ఈ రాశివారి లక్కీ కలర్ ఎరుపు, తెలుపు

మకర రాశి

ఈ వారం ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది.. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, మీ కోసం సమయం కేటాయించండి, సంపూర్ణ నిద్ర చాలా అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దు..పరిపక్వతతో పనిచేయండి, మీ పనిని ఆలస్యం చేయకండి, పూర్తి నిజాయితీతో పూర్తి చేయండి. చుట్టుపక్కల జరిగే గొడవలకు దూరంగా ఉండండి. అవసరం లేని దగ్గర మీ అభిప్రాయం చెప్పొద్దు. వారం చివరిలో మీరు ఒక వేడుకకు సిద్ధం కావచ్చు. మీ లక్కీ కలర్ బ్రౌన్

కుంభ రాశి 

ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ఒత్తిడికి గురికావద్దు. ఈ వారం మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ మీరు వాటన్నింటినీ అధిగమించడంలో విజయం సాధిస్తారు. మీ మనస్సు చెప్పింది వినండి. ఆర్థిక  ప్రయోజనం చేకూరుతుంది. వచ్చిన అవకాశాన్ని గుర్తించాలి. ప్రయాణాలు చేస్తారు,చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెరపండి. ఓ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు. 

మీన రాశి

ఈ వారం మీరు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మహిళలకు ఇది మంచి సమయం. వివాహితులకు సంతాన సాఫల్యం లభిస్తుంది. అవివాహితుల ప్రేమ పెళ్లి జరగబోతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు చాలా కష్టపడతారు..కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ చుట్టుపక్కల వ్యక్తుల గురించి తెలుసుకోండి. నాయకులకు ఇది చాలా మంచి రోజు, ప్రజలు మీ మాటలతో స్ఫూర్తి పొందుతారు. ఈ  వారం మీ లక్కీ కలర్ ఆరెంజ్.

 

Published at : 05 Mar 2023 06:08 AM (IST) Tags: Check Astrological prediction Weekly Horoscope Telugu Weekly Horoscope predictions Weekly Horoscope Aries Weekly Horoscope leo Rasi Phalalu Weekly March 6xth to 12th Weekly Horoscope

సంబంధిత కథనాలు

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి