Holi Wishes In Telugu 2023: హోలీ శుభాకాంక్షలు, కలర్ ఫుల్ విషెస్ చెప్పేయండిలా!
హోలీ శుభాకాంక్షలు: హరివిల్లును నేలకు దించే కలర్ ఫుల్ పండుగ హోలీ. రంగుల వేడుక సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి
Holi Wishes In Telugu 2023: 'హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను వేస్తారు. విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లు ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం. ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు . రంగుల పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే హోలీ
- హోలీ శుభాకాంక్షలు.
సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండగ
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు
అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసుంటేనే దేశానికి అందం
-అందరికి హోలీ శుభాకాంక్షలు
రంగుల పండుగ వచ్చే..
హరివిల్లు నేలను దించే..
అందరిలో ఆనందాన్ని తెచ్చే..
- అందరికీ హోలీ శుభాకాంక్షలు
హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు
అనురాగ, ఆప్యాయతలు కలిగిన పన్నీటి రంగులు
-అందరీకి హోలీ శుభాకాంక్షలు
వసంత కాలంలో..
వచ్చింది రంగుల హోలీ..
తెచ్చింది సంతోష కేళీ..
- అందరికీ హోలీ శుభాకాంక్షలు.
సుఖం, దుఃఖం, సంతోషం..
ఆనందలకు చిరునామా..
ఈ రంగుల పండగ.
- హోలీ శుభాకాంక్షలు.
ఆ నింగిలోని హరివిల్లు..
మీ ఇంట విరియాలి..
ఆ ఆనందపు రంగులు..
మీ జీవితంలో నిండాలి.
- హ్యాపీ హోలీ
హోలీ నింపాలి మీ జీవితాల్లో ఆనంద రంగేలీ..
- హ్యాపీ హోలీ
హరివిల్లిలాంటి హోలీ రంగులు..
అలుపెరుగని సంబరాలు..
ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపును సంతోషాలు
అందరికీ హోలి శుభాకాంక్షలు
హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం..
రసాయనాలు వద్దే వద్దు మనకొద్దు.. ప్రకృతిసిద్ధ రంగులే ముద్దు.
ఈ హోలీని సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు
Also Read: అక్కడ మజ్జిగ కుండ పగులగొట్టినోడే హోలీరాజు, దేశంలో వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకలు!
ఇంద్రధనస్సులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..
ఈ హోలీని మరింత కలర్‌ఫుల్ చేసేద్దాం.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
ఇవి రంగులు కావు..
మన ప్రేమానురాగాలు..
ఈ అల్లరిలో అప్యాయత ఉంటుంది..
మరుపురాని సంతోషం దాగి ఉంటుంది..
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
ఈ ప్రకృతికి అందం రంగులతోనే వచ్చింది.
అందుకే, రసాయనాలు వద్దు సహజ రంగులే ముద్దు.
- అందరికీ హ్యాపీ హోలీ.
రంగులు వేర్వేరు..
కానీ, అవి ఇచ్చే ఆనందం ఒకటే.
మన మనసులు కూడా అంతే..
కానీ, మనమంతా వసుదైక కుటుంబం.
కలిసుందాం కడ వరకు.
- అందరికీ హ్యాపీ హోలీ