మార్చి 6 నుంచి 12 వారఫలాలు



మేష రాశి
ఈ వారం ఈ రాశివారు చాలా బిజీగా ఉంటారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. త్వరలోనే శుభవార్త వింటారు. ఈ వారం ప్రయాణం చేయాల్సి వస్తుంది. విదేశాల నుంచి నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు పనిప్రాంతంలో కొంత ప్రతికూలతను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



వృషభ రాశి
ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ వారం అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. లాభాలు ఆర్జిస్తారు. అవసరమైన వారికి సహాయం చేయండి. కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కానీ కాలం గడిచే కొద్దీ అంతా బాగుంటుంది.



మిథున రాశి
ఈ వారం ఈ రాశివారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీ దినచర్య మెరుగుపడుతుంది. మీరు మీ పనులను మరింత మెరుగ్గా నిర్వహించగలుగుతారు. కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది



కర్కాటక రాశి
ఈ రాశి అవివాహితులకు వివాహం మరింత ఆలస్యమవుతుంది. ఈ వారం మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ధనలాభం పొందుతారు... కుటుంబానికి సమయం కేటాయించండి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మేయవద్దు. త్వరలోనే మీ జీవితంలో మార్పు వస్తుంది. మంచి సమాచారం పొందుతారు.



సింహ రాశి
ఈ వారం సింహరాశికి చెందినవారు పోటీ పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన మంచి మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలపై పూర్తి అనగాహనతో ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.



కన్యా రాశి
ఈ వారం ఆరంభంలో ఈ రాశివారికి ప్రయాణం చేయకతప్పదు. మీపై దైవానుగ్రహం ఉంటుంది. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, చాలా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ వహించండి. పని ఒత్తిడిలో కుటుంబాన్ని, జీవితభాగస్వామిని విస్మరించవద్దు.



తులా రాశి
ఈ వారం తులారాశివారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాళి మహిళలకు ఇది చాలా శుభ సమయం. బహుమతులు అందుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది. ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు..ఇతరులకు ఇచ్చే సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.



వృశ్చిక రాశి
ఈ వారం ఈ రాశివారికి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. మీ కారణంగా కొందరు నష్టపోతారు, మీ గౌరవం తగ్గుతుంది. కొన్ని రోజుల పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ గొడవ పడకండి, నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి.



ధనుస్సురాశి
ఈ వారం మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. పరిపక్వతతో పనిచేయాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇకరావు అనుకున్న చోటు నుంచి డబ్బులు చేతికి అందవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.



మకర రాశి
ఈ వారం ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, మీ కోసం సమయం కేటాయించండి, సంపూర్ణ నిద్ర చాలా అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దు..పరిపక్వతతో పనిచేయండి, మీ పనిని ఆలస్యం చేయకండి, పూర్తి నిజాయితీతో పూర్తి చేయండి. గొడవలకు దూరంగా ఉండండి.



కుంభ రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ఒత్తిడికి గురికావద్దు. ఈ వారం మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ మీరు వాటన్నింటినీ అధిగమించడంలో విజయం సాధిస్తారు. మీ మనస్సు చెప్పింది వినండి. ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. వచ్చిన అవకాశాన్ని గుర్తించాలి.



మీన రాశి
ఈ వారం మీరు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మహిళలకు ఇది మంచి సమయం. వివాహితులకు సంతాన సాఫల్యం లభిస్తుంది. అవివాహితుల ప్రేమ పెళ్లి జరగబోతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు చాలా కష్టపడతారు..కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ చుట్టుపక్కల వ్యక్తుల గురించి తెలుసుకోండి.