మార్చి నెల రాశిఫలితం: ఈ రాశులవారికి అనుకూలం, వారికి ప్రతికూల ఫలితం
మేష రాశి మార్చి నెల మేషరాశివారికి మిశ్రమఫలితాలున్నాయి.ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం కారణంగా చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి ఈ రాశివారికి మార్చి నెలలో సోదరులతో విభేదాలు వస్తాయి.. ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యానికి హాజరవుతారు. రావాల్సిన మొత్తం చేతికందుతుంది..ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కోపం తగ్గించుకోపోవడం వల్ల కొన్ని కార్యాలు అర్థాంతరంగా ఆగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేస్తారు.
మిథున రాశి ఈ నెలలో గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకుండా తమపని తాముచేసుకోవడం మంచిది. మీలో ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు.
కర్కాటక రాశి మార్చి నెల ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం బావుంటుంది. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత సరిగా ఉండదు. అధికారులు, శత్రుల వలన ఇబ్బందులు పడతారు. అపనిందలు తప్పవు. ఆర్థిక సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. నెల చివర్లో పరిస్థితులు మీకు కలిసొస్తాయి.
సింహ రాశి సింహరాశివారికి ఈ నెల పరిస్థితులు అంత అనకూలంగా లేవు. నమ్మినవారివల్ల మోసపోతారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి తగాదాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి
కన్యా రాశి నెలలో మొదటి అర్థభాగం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా కలిసొస్తుంది. వ్యవహారాల్లో జయం, నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ద్వితీయార్థంలో అష్టమ శుక్రుడు ప్రభావంవల్ల ఇంటా బయటా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు..కానీ అవన్నీ సమసిపోతాయి.
తులా రాశి ఈ నెలలో అన్నిరంగాల వారికి చేయూత లభిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటి వరకూ వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతోషకర వార్తలు వింటారు. అయినప్పటికీ ఏదో విషయంలో మానసికంగా బాధపడతారు
వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి మార్చినెల పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అన్ని పనుల్లో మిశ్రమ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. వ్యాపారులు లాభపడతారు. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. ధైర్యసాహసాలతో ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన నెరవేరుతుంది. శత్రులపై పైచేయి సాధిస్తారు
ధనస్సు రాశి మార్చి నెల ధనస్సు రాశివారికి బావుంటుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. చేసేపనిలో ధైర్యంగా అడుగేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తాయి. కఠినమైన సమస్య ఎదురైనా అలవోకగా పరిష్కరించుకుంటారు. ధనలాభం ఉంటుంది.
మకర రాశి మకర రాశివారికి చెందిన వారు ఈ నెలలో అన్ని రంగాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఇంట్లో పెండింగ్ ఉన్న శుభకార్యం పూర్తిచేసేందుకు అడుగు ముందుకేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించని విరోధాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.
కుంభ రాశి ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా లేకపోవడంతో అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురువుతాయి. వృత్తి,వ్యాపారాల్లో అనుకూలత ఉండదు. అనారోగ్య సమస్యలుంటాయి. ధైర్యం కోల్పోతారు. అనవసరంగా మాటలుపడతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. అకాల భోజనం చేస్తారు.
మీన రాశి మీన రాశివారికి మార్చి నెల పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆపదలు సంభవించే ప్రమాదం ఉంది. నమ్మినవారివలన మోసపోతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో అడుగు ముందుకు పడదు...నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు.