Image Credit: Freepik
మే 4 రాశిఫలాలు: ఈ రోజు తులారాశివారు శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశివారికి ఆర్థిక లాభాలున్నాయి. మీనరాశివారి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు అన్ని రాశుల ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ రాశివారి శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. అనుకోని సమస్యలు రావొచ్చు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది కానీ నూతన పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఈ రాశివారు నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో సమయం గడపడం వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
ఈ రాశివారు తెలివితేటలు, సమర్థతతో అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సీనియర్లు, అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. స్థిర, చరాస్తుల లాభాన్ని పొందుతారు. సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.
Also Read: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం
ఈ రాశివారి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పిల్లల వివాహాల గురించి చర్చ జరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలున్నాయి.
ఈ రాశివారిపై శత్రువుల కుట్రలు విఫలమవుతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు ఏదో ఆందోళనలో ఉంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక విషయాలలో మీకు కలిసొస్తుంది. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. ఆకస్మిక ఖర్చుల వల్ల కూడా ఇబ్బంది పడతారు.
ఈ రోజు ఈ రాశివారి రహస్య శత్రువులు చురుకుగా ఉంటారు..మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు.కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో ఇబ్బంది పడతారు. ఖర్చులు పెరుగుతాయి..ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బు వృధా చేయవద్దు. మీ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి.
ఈ రోజు ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. మీ మనసులో మాటని ఇతరులకు చెప్పడంలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ విధానాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల నిర్ణయం మీకు అనుకూలంగా రావొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వింటారు.
ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో వివాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలను అనుసరించి ముందుకు సాగితే మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీరు కాస్త ఇబ్బందిపడినా..భవిష్యత్ లో లాభపడతారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారం కోసం ఏదైనా కొత్తగా ట్రై చేసేందుకు ఆలోచించవచ్చు.
ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. అనవసర ఆలోచనలు చేయవద్దు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించాలి. ఏపని చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కానీ అందులో కొన్ని ఆకస్మిక మార్పలు చేయాల్సి రావొచ్చు. మీ తోబుట్టువులతో విభేధాలు రావొచ్చు.
పిల్లల వివాహంలో వచ్చే సమస్యలు తీరిపోతాయి. ఈరోజు మీ సామాజిక ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ వాతావరణంలో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి
Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది
Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!
Chanakya Neeti In Telugu: కష్టకాలంలోనే వీరి నిజ స్వరూపం తెలుస్తుంది..!
జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి