Horoscope Today 4th March 2024: ఈ రోజు ఈ రాశులవారు అప్పులు ఇవ్వొద్దు , తీసుకోవద్దు - మార్చి 04 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
![Horoscope Today 4th March 2024: ఈ రోజు ఈ రాశులవారు అప్పులు ఇవ్వొద్దు , తీసుకోవద్దు - మార్చి 04 రాశిఫలాలు Horoscope Today 4th March 2024 Daily Horoscope And Astrology Predictions All Zodiac Signs in telugu Horoscope Today 4th March 2024: ఈ రోజు ఈ రాశులవారు అప్పులు ఇవ్వొద్దు , తీసుకోవద్దు - మార్చి 04 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/03/a544bb25b6d37e9d3dc6fad4698d79011709489101674217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Today Horoscope 4th March 2024
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబం లేదా బంధువులతో డబ్బుకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కుటుంబ సభ్యులు , స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఈరోజు శుభవార్త అందుకుంటారు
వృషభ రాశి
ఈ రోజు మీకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో పని కోసం అదనపు బాధ్యతలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలును వాయిదా వేయండి.
Also Read: వయసైపోతున్నా పెళ్లి కాలేదా..అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!
మిథున రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
కర్కాటక రాశి
ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రయాణ సమయంలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!
సింహ రాశి
సంబంధాలలో అపార్థాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. కొంతమంది కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.
తులా రాశి
ఈ రోజు తుల రాశి వారి శ్రమ ఫలిస్తుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మీ పని పట్ల మీ కృషి , అంకితభావం వ్యర్థం కాదు. మీరు అదనపు పని బాధ్యతలను పొందుతారు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. కొత్త పెట్టుబడి ఎంపికలపై నిఘా ఉంచడం మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు.
Also Read: చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!
వృశ్చిక రాశి
ఈ రాశివారికి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించాలి. వ్యాపార సంబంధిత నిర్ణయాలలో నిపుణుల సలహా తీసుకోవడానికి సంకోచించవద్దు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి.
ధనస్సు రాశి
ఈ రాశివారు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకోవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంటికి అతిధుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది
Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!
మకర రాశి
ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పనిపై దృష్టి పెట్టండి. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నించాలి. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మరికొంత కాలం ఆగడం మంచిది. కుటుంబ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు చదువు ఒత్తిడి కొంత తగ్గుతుంది.
కుంభ రాశి
ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. అన్ని పనులలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. స్నేహితుని నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.
Also Read: ఈ వారం (మార్చి 03 - 09) ఈ రాశులవారికి ప్రశంసలు అందుకునే సమయం
మీన రాశి
ఈ రాశివారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)